‘స్కంద’ మాస్ మూవీ మాత్రమే కాదు ఫ్యామిలీ అంత ఎంజాయ్ చేసే ఎంటర్టైనర్ – ప్రీ రిలీజ్ ఈవెంట్ లో హీరో రామ్

‘స్కంద’ మాస్ మూవీ మాత్రమే కాదు ఫ్యామిలీ అంత ఎంజాయ్ చేసే ఎంటర్టైనర్ – ప్రీ రిలీజ్ ఈవెంట్ లో హీరో రామ్

Published on Sep 26, 2023 3:00 AM IST

హీరో రామ్ తాజాగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కుతున్న లేటెస్ట్ మూవీ స్కంద. సెప్టెంబర్ 28న ఈ మూవీ గ్రాండ్ గా పలు భాషల ఆడియన్స్ ముందుకి రానుంది. శ్రీలీల హీరోయిన్ గా నటిస్తున్న ఈ మూవీకి ఎస్ థమన్ సంగీతం అందిస్తుండగా శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ బ్యానర్ పై శ్రీనివాస చిట్టూరి దీనిని భారీ స్థాయిలో పాన్ ఇండియన్ రేంజ్ లో నిర్మించారు.

ఇక నేడు స్కంద యొక్క ప్రీ రిలీజ్ ఈవెంట్ కరీంనగర్ లో వైభవంగా జరిగింది. ఈ సందర్భంగా హీరో రామ్ మాట్లాడుతూ, స్కంద కోసం టీమ్ మొత్తం ఎంతో కష్టపడ్డారని అన్నారు. ఇక దర్శకుడు బోయపాటి శ్రీను గత సినిమాల మాదిరిగా స్కంద ని కూడా ఎంతో అద్భుతంగా తెరకెక్కించారని అన్నారు. ఆయన సినిమాల్లో కేవలం మాస్ సీన్స్ మాత్రమే కాదు వాటితో మంచి ఎమోషన్స్ కనెక్ట్ అయి ఉంటాయని తెలిపారు.

మొదటి నుండి తనకు ఎంతో సపోర్ట్ గా నిలుస్తున్న ఫ్యాన్స్ కి ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్పిన రామ్, స్కంద కేవలం మాస్ మూవీ మాత్రమే కాదు మంచి ఫామిలీ అంతా బాగా ఎంజాయ్ చేసే ఎంటర్టైనర్ అని అన్నారు. తప్పకుండా మూవీ మంచి సక్సెస్ అందుకుంటుందనే ఆశాభావాన్ని ఆయన వ్యక్తం చేసారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు