“బేబీ” సక్సెస్ తో టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ గా మారిన SKN

“బేబీ” సక్సెస్ తో టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ గా మారిన SKN

Published on Jul 21, 2023 11:30 PM IST


SKN ఇటీవల విడుదలైన రొమాంటిక్ డ్రామా బేబీతో అద్భుతమైన బ్లాక్‌బస్టర్‌ని సాధించాడు. ఒక చిన్న జర్నలిస్ట్ నుండి PRO గా, ఇప్పుడు నిర్మాత గా సక్సెస్ అయ్యారు. SKN ప్రయాణం యంగ్ ప్రొడ్యూసర్స్ కి ఇప్పుడు ప్రేరణ అని చెప్పాలి. టాక్సీవాలా మరియు బేబీ రూపంలో విజయ్ దేవరకొండ మరియు ఆనంద్ దేవరకొండలతో బ్లాక్ బస్టర్స్ సాధించడంతో ఎస్‌కెఎన్ లక్కీ నిర్మాతగా మారారు.

భవిష్యత్తులో SKN తో సినిమాలు చేసేందుకు చాలా మంది హీరోలు ఆసక్తి చూపుతున్నారు. SKN తన సినిమాలను ప్రమోట్ చేస్తున్న తీరు కూడా ఒక కారణం అని చెప్పాలి. మారుతీ, రాహుల్ మరియు సాయి రాజేష్ వంటి ప్రతిభావంతులైన దర్శకులను SKN కనుగొన్నారు. తెలుగు హీరోయిన్లకు ఎస్‌కెఎన్‌ ఛాన్స్‌లు ఇస్తుండడం స్పెషల్ అని చెప్పాలి. నిర్మాత ఇప్పుడు సందీప్ రాజ్ తో ఓ భారీ చిత్రాన్ని ప్లాన్ చేస్తున్నాడు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు