ప్రస్తుతం గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటిస్తున్న అవైటెడ్ చిత్రం కోసం అందరికీ తెలిసిందే. చరణ్ కెరీర్లో 16వ సినిమాగా దర్శకుడు బుచ్చిబాబు సానా తెరకెక్కిస్తున్న రూరల్ స్పోర్ట్స్ డ్రామా ఇది కాగా దీనిపై నెక్స్ట్ లెవెల్ హైప్ అభిమానుల్లో ఉంది. ఇక ఈ చిత్రం నుంచి రేపు మార్చ్ 27 గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ పుట్టినరోజు కానుకగా ట్రీట్ ఏముంటుందా అని అంతా ఎగ్జైటెడ్ గా ఎదురు చూస్తున్నారు.
అయితే రామ్ చరణ్ నటిస్తున్న ఈ సినిమాకి సంబంధించి ఎలాంటి అధికారిక అప్డేట్ చిత్ర నిర్మాణ సంస్థ నుంచి ముందుగా కూడా హింట్ రాలేదు కానీ కొందరు మాత్రం సోషల్ మీడియాలో ఈ సాయంత్రం 4 గంటల 5 నిమిషాలకే అప్డేట్ వచ్చేస్తుంది అంటూ పోస్ట్ లు చేయడంతో రామ్ చరణ్ అభిమానులు ఇతర మెగా ఫ్యాన్స్ అంతా అదే నిజం అని నమ్మి పడిగాపులు కాచారు.
కానీ సీన్ కట్ చేస్తే అసలు ఆ టైం కి కనీసం చిత్ర నిర్మాణ సంస్థల నుంచి చిన్న డాట్ పోస్ట్ కూడా రాలేదు. అయితే ఇక్కడ క్లియర్ గా రామ్ చరణ్ అభిమానుల ఎమోషన్స్ తో ఆ కొన్ని సోషల్ మీడియా హ్యాండిల్స్ వారు ఆడుకుంటున్నారని చెప్పవచ్చు. ఒకవేళ నిజంగా అప్డేట్ ఏదన్నా ఉంది అంటే స్వయంగా నిర్మాణ సంస్థ నుంచే రేపు బర్త్ డే కాబట్టి నేడు ఏదొక హింట్ లాంటిది అయినా వస్తుంది.
కానీ అలాంటి ఏవి లేకుండానే నేడు సాయంత్రం 4 గంటల 5 నిమిషాలకి అప్డేట్ వస్తుంది అన్నట్టుగా ఎవరికీ నచ్చిన టైం ని వారు కొందరు రుద్దేస్తున్నారు. కానీ దాని ఫలితం రామ్ చరణ్ అభిమానులకి తీవ్ర నిరాశ మిగలడం. సో ఇలాంటి వాటిలో ఏ హీరో అభిమానులు అయినా జాగ్రత్తగా ఉండాల్సిందే అని చెప్పవచ్చు. ఏదైనా అప్డేట్ లేదా వార్త లాంటిది ఉంటే ఖచ్చితంగా చిత్ర నిర్మాణ సంస్థ హ్యాండిల్ నుంచే వస్తాయని వారు గుర్తుంచుకోవాలి. మధ్యలో కొందరు ఇన్వాల్వ్ మెంట్ తో అనవసరంగా తమ ఎగ్జైట్మెంట్, ఎమోషన్స్ వేస్ట్ అవుతున్నాయి అనేది ఆ కొందరు కూడా గుర్తుంచుకోవాలి.