వెట్రిమారన్ తో సినిమా నిజమే అయితే..

టాలీవుడ్ మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ హీరోగా దర్శకుడు కొరటాల శివ కాంబినేషన్ లో వస్తున్న మోస్ట్ అవైటెడ్ భారీ చిత్రం “దేవర” కోసం అందరికీ తెలిసిందే. అయితే ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఎన్టీఆర్ తమిళ్ లో ఒక ప్రెస్ మీట్ నిర్వహించిన సంగతి తెలిసిందే. అయితే ఇందులో తారక్ ఇచ్చిన ఓ స్టేట్మెంట్ మాత్రం వైరల్ గా మారింది. కోలీవుడ్ తన డెబ్యూ కోసం మాట్లాడుతూ తాను దర్శకుడు వెట్రిమారన్ తో వర్క్ చేసేందుకు ఎంతో ఆసక్తిగా ఉన్నానని తెలిపాడు.

దీనితో ఈ క్రేజీ స్టేట్మెంట్ వైరల్ గా మారింది. అయితే ఈ ఇద్దరి కాంబినేషన్ పై గతంలో కూడా పలు రూమర్స్ వినిపించాయి. అలాగే ఇప్పుడు ఎలాగో తారక్ కూడా అదే దర్శకుడుతో సినిమాపై మాట్లాడ్డం అన్ని డాట్స్ ని కలుపుతుంది. సో వెట్రిమారన్ తో సినిమా ఉంటుంది అనేది దాదాపు నిజమే అని చెప్పాలి. వెట్రి లాంటి రా అండ్ రస్టిక్ దర్శకుడుకి తారక్ లాంటి పెర్ఫామర్ దొరికితే ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. మరి ఈ కాంబినేషన్ భవిష్యత్తులో ఎప్పుడు కార్యరూపం దాలుస్తుందో అనేది చూడాలి.

Exit mobile version