“క్రిష్ 4” ఆలస్యంకి చాలా కారణాలట.!

“క్రిష్ 4” ఆలస్యంకి చాలా కారణాలట.!

Published on Aug 5, 2023 3:03 PM IST

బాలీవుడ్ సినిమా దగ్గ వచ్చిన ఎన్నో జెమ్ లాంటి చిత్రాల్లో స్టార్ హీరో హృతి రోషన్ హీరోగా ప్రియాంక చోప్రా హీరోయిన్ గా దర్శకుడు రాకేష్ రోషన్ కాంబినేషన్ లో తెరకెక్కిన సెన్సేషనల్ సూపర్ హీరో ఫ్రాంచైజ్ చిత్రం “క్రిష్” కూడా ఒకటి. మరి పాన్ ఇండియా వైడ్ ఎప్పుడో హిట్ అయ్యిన ఈ సూపర్ హీరో ఫ్రాంచైజ్ నుంచి నాలుగో సినిమా కోసం ఎప్పుడు నుంచో ఆడియెన్స్ వెయిట్ చేస్తున్నారు.

అయితే అసలు అనౌన్స్ చేసి సినిమా ఇంకా స్టార్ట్ కూడా కాకపోవడానికి చాలా కారణాలు ఉన్నట్టుగా తెలుస్తుంది. మరి లేటెస్ట్ గా దర్శకుడు రాకేష్ రోషన్ ఇండియా టుడే లో మాట్లాడుతూ క్రిష్ 4 ఆలస్యానికి చాలా కారణాలు ఉన్నాయని ఇంకా ఆడియెన్స్ థియేటర్స్ లోకి వస్తున్నారో లేదో అనేది పెద్ద ప్రశ్నగా నాకు అనిపిస్తుంది.

అలాగే సినిమా బడ్జెట్ సహా మేకింగ్ కి అయ్యే ఖర్చు సినిమా గ్రాఫిక్ వర్క్స్ కూడా మరో కారణాలు అని తన వెర్షన్ లో సినిమా లేట్ కి కారణం ఇదే అని కన్ఫర్మ్ చేశారు. మరి ఓ సరైన సినిమా వస్తే ఆడియెన్స్ అప్పుడే కాదు ఇప్పుడు కూడా థియేటర్స్ కే వస్తున్నారు. మరి ఈ క్రేజీ ప్రాజెక్ట్ విషయంలో మరింత క్లారిటీ వస్తే మూవీ లవర్స్ కి ఊరటగా ఉంటుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు