శంకర్ కంబ్యాక్ కోసం కూడా చాలా మంది వెయిటింగ్..!

ఇండియన్ సినిమా దగ్గర దర్శకుల్లో “ఓజి” శంకర్ కోసం ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. తన కెరీర్ స్టార్టింగ్ లోనే తన విజన్ ఏంటో అందరికీ చూపించి అప్పట్లోనే పాన్ ఇండియా లెవెల్లో తన ముద్ర వేసుకున్నారు. అయితే ఇపుడు శంకర్ నుంచి తన రేంజ్ హిట్ పడి చాలా కాలం అయ్యింది. ఇటీవల వచ్చిన “భారతీయుడు 2” దారుణంగా విఫలం అయ్యింది.

దీనితో ఒక అన్ని ఆశలు ఇపుడు వస్తున్న గేమ్ ఛేంజర్ మీదనే ఉన్నాయని చెప్పి తీరాలి. అయితే గేమ్ ఛేంజర్ తో వాళ్ళు వీళ్ళు కాదు శంకర్ కం బ్యాక్ కొట్టి మళ్ళీ ఫామ్ లోకి వస్తే తన స్టామినా ఏంటో చూడాలని చాలామంది తన ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అప్పట్లోనే తన స్టైలిష్ టేకింగ్, విజువల్స్ గ్రాండియర్ తోనే ఆశ్చర్యపరిచారు.

అయితే ఇపుడు గాడి తప్పారు కానీ తాను పొందిన గౌరవం మాత్రం అలానే ఉంది. అందుకే తమిళ ఆడియెన్స్ సహా తెలుగులో కూడా చాలా మంది శంకర్ మాస్ కంబ్యాక్ ఇస్తే చూడాలని చాలా ఎమోషనల్ గా కూడా ఎదురు చూస్తున్నారు. మరి గేమ్ ఛేంజర్ విషయంలో ఏమవుతుందో చూడాలి.

Exit mobile version