“జార్జ్ రెడ్డి” మేకర్స్ తో సోహెల్ గోల్డెన్ ఛాన్స్.!

“జార్జ్ రెడ్డి” మేకర్స్ తో సోహెల్ గోల్డెన్ ఛాన్స్.!

Published on Dec 24, 2020 10:00 AM IST

మన తెలుగు రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్ 4 విన్నర్ అండ్ రన్నర్ లకు లైఫ్ ఎలా చేంజ్ అయ్యిందో కానీ సోహెల్ కు మాత్రం ఇప్పుడు ఓ రేంజ్ లో ఉందని చెప్పాలి. టాలీవుడ్ లో తన మొదటి సినిమా జార్జ్ రెడ్డి తోనే తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని ఏర్పర్చుకున్న ప్రొడ్యూసర్ అప్పి రెడ్డి తన మూడవ చిత్రాన్ని శరవేగంగా ముందుకు నడిపిస్తున్నారు. జార్జ్ రెడ్డి, ప్రజర్ కుక్కర్ లాంటి సినిమాలతో విమర్శకులనుంచి ప్రశంసలు అందుకుని ఇప్పుడు అదే దారిలో మరొక కొత్త కథ తో ముందుకు రాబోతున్నారు.

బిగ్ బాస్ సీజన్ 4 లో ఇప్పటివరకు ఏ కంటెస్టెంట్ కి రానంత క్రేజీ సంపాయించుకొని, మెగాస్టార్ట్ చిరంజీవి గారు, కింగ్ నాగార్జునా ల గారిచే ప్రేమ వరాల జల్లులు కురిపించుకున్న, ఎంతో మంది ప్రేక్షక అభిమానుల మనసులు కొల్లగొట్టిన సింగరేణి ముద్దు బిడ్డ సయ్యద్ సోహెల్ , నూతన దర్శకుడు శ్రీనివాస్ వింజనంపాటి కలయిక లో ఈ చిత్రం తెరకెక్క బోతుంది.

శ్రీనివాస్ సారధ్యం లో ఒక వినూత్నకధాంశంతో, తెలుగు చలన చిత్ర సీమలో ఇప్పటివరకు ఎవరు సాహసించని, ప్రయత్నించని , ఒక కొత్త కథ తో , అన్ని వర్గాలకు నచ్చేలా లవ్ ట్రాక్ తో నడిచే ఎమోషనల్ మెలోడీ డ్రామాతో ఈ సినిమా తెరకెక్క బోతున్నట్లు తెలుస్తుంది.

ఇక సయ్యద్ సోహెల్ మాట్లాడుతూ, నిజంగానే కథ వేరే ఉంటది, ఈ సినిమాతో అన్ని వర్గాల ప్రజల మనసులు ముఖ్యంగా మహిళల మనసులు కొల్లగొట్టబోతున్నట్లు చెప్పారు. మూవీ టైటిల్ ని, కధావిశేషాలని త్వరలో తెలియపరచనున్నారు. ప్రస్తుతం ప్రీ పొడక్షన్ పనులు జరుగుతున్నాయని,త్వరలోనే సెట్స్ పైకి వెళ్తామని, తెలిపారు. అలాగే ఇతర క్యాస్టింగ్ సమాచారాన్ని కూడా తొందరలోనే వెల్లడి చేయనున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు