బిగ్ బాస్ 4 – ఫైనల్స్ రోజు సోహెల్ పరువు తీస్తున్నారు.!

బిగ్ బాస్ 4 – ఫైనల్స్ రోజు సోహెల్ పరువు తీస్తున్నారు.!

Published on Dec 20, 2020 11:09 AM IST

ఈరోజు మన తెలుగు బిగ్గెస్ట్ రియాలిటీ షో అయినటువంటి బిగ్ బాస్ తెలుగు సీజన్ 4 గ్రాండ్ ఫినాలే జరుగుతున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు స్మాల్ స్క్రీన్ వీక్షకుల్లో ఇదే మంచి హాట్ టాపిక్ గా నిలిచింది. అయితే ఈసారి సీజన్లో ఫైనలిస్టులుగా వచ్చిన టాప్ 5లో ఉన్న ప్రతీ ఒక్కరికీ పాజిటివ్ లు ఉన్నాయి అలాగే రిమార్కులు కూడా ఉన్నాయి. అయితే రిమార్క్ నుంచి స్టాట్ అయ్యి ఇప్పుడు మంచి ఆదరణను దక్కించుకున్న కంటెస్టెంట్ ఎవరన్నా ఉన్నారు అంటే అది సయ్యద్ సోహెల్ అని చెప్పాలి.

మిస్టర్ యాంగ్రీ యంగ్ మెన్ కాస్తా ఇప్పుడు మోస్ట్ ఎమోషనల్ పర్సన్ గా నిలిచాడు. అయితే టైటిల్ విన్నింగ్ అనే అంశాన్ని పక్కన పెడితే అందరి కంటెస్టెంట్స్ లానే సోహెల్ అధికారిక సోషల్ మీడియాను కూడా అతని టీం హ్యాండిల్ చేస్తుంది. మరి సరిగ్గా ఇదే ఫైనల్స్ రోజున సోహెల్ హ్యాండిల్ నుంచి పడ్డ ఓ స్టేటస్ మాత్రం పూర్తిగా అతడు ఇప్పటి వరకు సంపాదించుకున్న గ్రాటిట్యూడ్ ను దెబ్బ తీసింది.

అతని అధికారిగా ఇన్స్టాగ్రమ్ అకౌంట్ లో బిగ్ బాస్ హౌస్ లో ఓ కంటెస్టెంట్ ను ఉద్దేశించి “పులిహోర కలపడం అంటే ఇలా పులిలా బతకడం అంటే ఇలా” అంటూ అవతల కంటెస్టెంట్ ను డీగ్రేడ్ చేస్తూ పెట్టారు. దీనితో సోహెల్ టీం ఇంత చీప్ గా ఉన్నారేంటి అని ఇది ఎంత వరకు కరెక్ట్ అని అది చూసిన బిగ్ బాస్ షో ఫాలోవర్స్ ప్రతీ ఒక్కరూ అంటున్నారు. మరి అది ఎవరు చేసారో కానీ ఆఫీసియల్ హ్యాండిల్ నుంచే అది పడింది. సరిగ్గా ఫైనల్స్ రోజునే అతడి టీం ఈ పోస్ట్ తో అతని పరువును తీసే పని చేసాడు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు