“సరిపోదా శనివారం” కి సాలిడ్ బుకింగ్స్

“సరిపోదా శనివారం” కి సాలిడ్ బుకింగ్స్

Published on Aug 25, 2024 10:32 PM IST


నాచురల్ స్టార్ నాని హీరోగా యంగ్ అండ్ టాలెంటెడ్ హీరోయిన్ ప్రియాంక మోహన్ హీరోయిన్ గా దర్శకుడు వివేక్ ఆత్రేయ తెరకెక్కించిన అవైటెడ్ మాస్ చిత్రమే “సరిపోదా శనివారం”. మరి ప్రమోషనల్ కంటెంట్ తో మంచి బజ్ ని రేకెత్తించిన ఈ సినిమా కోసం అభిమానులు సహా జెనరల్ ఆడియెన్స్ కూడా బాగానే ఎదురు చూస్తున్నారు. ఇలా నిన్న శనివారం నుంచే మేకర్స్ తెలుగు స్టేట్స్ లో బుకింగ్స్ ని ఓపెన్ చేయగా దీనికి సాలిడ్ రెస్పాన్స్ ఇప్పుడు నమోదు అయ్యింది.

మరి గడిచిన 24 గంటల్లో అయితే ఈ చిత్రానికి 17 వేలకు పైగా టికెట్స్ బుకింగ్ నమోదు అయ్యాయి. దీనితో ఇది మాత్రం డీసెంట్ స్టార్ట్ అనే చెప్పాలి. ఇక ముందు కొన్ని రోజులు ఉండగా మరిన్ని ప్రాంతాల్లో బుకింగ్స్ ఓపెన్ అవుతూ వస్తున్నాయి. వీటిలో చాలా చోట్ల ఫాస్ట్ ఫిల్లింగ్స్ కూడా పడుతున్నాయి. ఇలా ప్రస్తుతానికి అయితే సరిపోదా శనివారం కి ట్రెండింగ్ బాగానే ఉంది. మరి డే 1 వసూళ్లు ఎలా ఉంటాయో వేచి చూడాలి. ఇక ఈ చిత్రానికి జేక్స్ బిజోయ్ సంగీతం అందించగా ఎస్ జె సూర్య విలన్ గా నటించారు. అలాగే డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ నిర్మాణం వహించిన సంగతి తెలిసిందే.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు