తక్కువ ధర ఎక్కువ నిడివితో “పుష్ప 2”.. మళ్ళీ సాలిడ్ బుకింగ్స్

తక్కువ ధర ఎక్కువ నిడివితో “పుష్ప 2”.. మళ్ళీ సాలిడ్ బుకింగ్స్

Published on Jan 16, 2025 10:11 AM IST

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా రష్మిక మందన్నా హీరోయిన్ గా దర్శకుడు సుకుమార్ తెరకెక్కించిన భారీ చిత్రం “పుష్ప 2 ది రూల్” కోసం అందరికీ తెలిసిందే. మరి ఈ చిత్రం రికార్డు వసూళ్లతో అదరగొట్టి ఇండియన్ సినిమా ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. అలాగే అల్లు అర్జున్ పాన్ ఇండియా క్రేజ్ అంటే ఏంటో కూడా ఈ సినిమా చూపించింది. మరి ఈ సినిమాపై మేకర్స్ కొన్ని రోజులు కితమే మళ్ళీ అదనపు నిడివితో థియేటర్స్ లో సందడి చేసేందుకు సిద్ధం అవుతుంది అని కన్ఫర్మ్ చేశారు.

ఇలా రేపు జనవరి 17 నుంచి అదనంగా 20 నిమిషాల నిడివితో వస్తుండగా దీనికి తక్కువ ధరలు పెడతాం అని చెప్పుకొచ్చారు. ఇలా ఆల్రెడీ తక్కువ ధరల్ని ఫిక్స్ చేశారు. సింగిల్ స్క్రీన్స్ లో అయితే మేకర్స్ గరిష్టంగా 112 రూపాయలు పెట్టగా మల్టీప్లెక్స్ లలో 150 గా పెట్టి రిలీజ్ చేస్తున్నారు. మరి ఇంట్రెస్టింగ్ గా తెలుగు స్టేట్స్ లో సింగిల్ స్క్రీన్స్ లో మళ్ళీ సాలిడ్ బుకింగ్స్ ఈ చిత్రానికి కనిపిస్తుండడం విశేషం. మరి ఈ అదనపు నిడివి కోసం కూడా అభిమానులు ఆసక్తిగా ఉన్నారని చెప్పొచ్చు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు