కన్నడలో “పుష్ప 2” కి క్రేజీ బిజినెస్ డీల్.!


ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా రష్మికా మందన్నా హీరోయిన్ గా దర్శకుడు సుకుమార్ తెరకెక్కిస్తున్న అవైటెడ్ భారీ చిత్రం “పుష్ప 2” కోసం అందరికి తెలిసిందే. మరి ఈ ఏడాదిలో ఉన్నటువంటి కొన్ని క్రేజీ పాన్ ఇండియా చిత్రాల్లో ఇది కూడా ఒకటి. కాస్త ఆలస్యం అవుతున్నప్పటికీ పార్ట్ 1 తర్వాత వస్తున్నా ఈ సీక్వెల్ పై కూడా మంచి బజ్ ఉండగా దీనితో పాటుగా వచ్చిన పాటలు కూడా సెన్సేషనల్ హిట్ అయ్యాయి.

ఇక దీనితో పాటుగా ఈ చిత్రానికి భారీ లెవెల్లో థియేట్రికల్ బిజినెస్ జరిగినట్టుగా కూడా ఇది వరకే టాక్ ఉంది. అయితే ఇపుడు కన్నడ రైట్స్ కి సంబంధించి లేటెస్ట్ బజ్ వినిపిస్తుంది. దీనితో ఈ సినిమాకి ఏకంగా ఒక్క కన్నడ హక్కులే 32 కోట్లకి అమ్ముడుపోయినట్టుగా వినిపిస్తుంది. ఇది టాలీవుడ్ నుంచి వచ్చిన సినిమాల్లో ఒకదానికి బిగ్గెస్ట్ డీల్ గా తెలుస్తుంది. మొత్తానికి అయితే పుష్ప 2 అపి హైప్ మామూలు లెవెల్లో లేదని చెప్పాలి. ఇక ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తుండగా మైత్రి మూవీ మేకర్స్ వారు నిర్మాణం వహిస్తున్న సంగతి తెలిసిందే.

Exit mobile version