నార్త్ లో “కల్కి 2898 ఎడి” డే 1 వసూళ్ల ప్రిడిక్షన్.!


పాన్ ఇండియా వైడ్ గా మంచి అంచనాలు సెట్ చేసుకుని రిలీజ్ కి రాబోతున్న అవైటెడ్ సినిమా కల్కి కోసం అందరికీ తెలిసిందే. రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా దర్శకుడు నాగ్ అశ్విన్ తెరకెక్కించిన ఈ సెన్సేషనల్ ప్రాజెక్ట్ లో నార్త్ సంబంధించి కూడా స్టార్ నటులు అమితాబ్, దీపికా పడుకోణ్ లు కూడా ఉన్నారు. అయితే వీరితో పాటుగా నార్త్ మార్కెట్ లో ప్రభాస్ కి కూడా సాలిడ్ క్రేజ్ ఉంది.

ఇంకా సినిమాపై కూడా నార్త్ ఆడియెన్స్ లో మంచి అంచనాలు ఉండగా ఇపుడు ఈ క్రేజీ ప్రాజెక్ట్ ఓపెనింగ్స్ పై సాలిడ్ బజ్ వినిపిస్తుంది. ప్రస్తుతం నార్త్ మార్కెట్ లో అడ్వాన్స్ బుకింగ్స్ చూస్తే కల్కి కి మంచి స్వింగ్ లో కనిపిస్తుండగా ప్రెజెంట్ ట్రెండ్ లో ఓపెనింగ్ డే కి టాక్ తో సంబంధం లేకుండా ఈజీగా 20 కోట్లు కొల్లగొడుతుంది అని ట్రేడ్ విశ్లేషకులు అంటున్నారు.

అలాగే ప్రీమియర్స్ నుంచి కానీ టాక్ అందుకుంటే ఇంకో 5 కోట్లు ఈజీగా కల్కి రాబడుతుంది అని దీనితో మొదటి రోజే ఒక్క హిందీ వెర్షన్ లోనే 25 కోట్లకి పైగా గ్రాస్ ని కల్కి అందుకునేందుకు హై ఛాన్సెస్ ఉన్నాయని టాక్. మొత్తానికి అయితే నార్త్ లో కూడా కల్కి భారీ ఓపెనింగ్స్ కి రంగం సిద్ధం చేసుకుంటుంది అని చెప్పొచ్చు.

Exit mobile version