ఓటీటీలో వచ్చినా కూడా విజయ్ సినిమాకి భారీ వసూళ్లు.!

ఇళయ దళపతి విజయ్ హీరోగా మీనాక్షి చౌదరి అలాగే స్నేహ హీరోయిన్స్ గా దర్శకుడు వెంకట్ ప్రభు తెరకెక్కించిన రీసెంట్ భారీ చిత్రమే “ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైం”. మరి విజయ్ గత సినిమాల్లా భారీ హైప్ లేకపోయినప్పటికీ టాక్ కూడా అంత పాజిటివ్ గా రానప్పటికీ ఈ సినిమా సాలిడ్ వసూళ్లు వరల్డ్ వైడ్ గా అందుకుంది. అలా 400 కోట్లకు పైగా గ్రాస్ ని ఈ సినిమా అందుకున్నట్టు నిర్మాతలు స్వయంగా తెలుపగా కొన్ని రోజులు కితమే ఈ చిత్రం ఓటీటీలోకి కూడా స్ట్రీమింగ్ కి వచ్చేసింది.

అయినప్పటికీ థియేటర్స్ లో గోట్ సాలిడ్ నంబర్స్ సెట్ చేస్తున్నట్టుగా నిర్మాతలు చెబుతున్నారు. సినిమా నిర్మాత రివీల్ చేసిన దాని ప్రకారం ఈ సినిమా 455 కోట్ల మార్క్ ని అందుకున్నట్టుగా తెలిపారు. దీనితో విజయ్ బాక్సాఫీస్ పవర్ ఎలా ఉందో అర్ధం చేసుకోవచ్చు. ఇక ఈ చిత్రానికి యువన్ శంకర్ రాజా సంగీతం అందించగా ఏజిఎస్ సినిమాస్ వారు నిర్మాణం వహించారు.

Exit mobile version