సేతుపతికి క్రేజీ డిమాండ్..”పుష్ప 2″ తర్వాత మరో భారీ సినిమాకి ఫిక్స్.!

Published on Jul 6, 2022 10:00 am IST


దక్షిణాది సినిమా దగ్గర ఉన్నటువంటి విలక్షణ నటులలో తమిళ స్టార్ నటుడు మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి కూడా ఒకడు. రీసెంట్ గా భారీ హిట్ సినిమా “విక్రమ్” లో తన నటన డిఫరెంట్ మ్యానరిజం తో అందరినీ షాక్ కి గురి చేసిన ఈ నటుడు నెక్స్ట్ ఓ రేంజ్ లైనప్ తో సిద్ధం అవుతున్నాడు. తాజాగా మన టాలీవుడ్ భారీ పాన్ ఇండియా సినిమా “పుష్ప 2” లో భాగం అయ్యినట్టుగా వార్తలు కన్ఫర్మ్ చెయ్యగా..

ఇప్పుడు మరో భారీ సినిమాలో కూడా ఫిక్స్ అయ్యినట్టుగా సినీ వర్గాలు వార్తలు కన్ఫర్మ్ చేస్తున్నాయి. తమిళ స్టార్ దర్శకుడు అట్లీ మరియు బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ తో చేస్తున్న సాలిడ్ పాన్ ఇండియా సినిమా జవాన్ లో విలన్ గా కనిపించబోతున్నట్టుగా ఇప్పుడు వార్తలు కన్ఫర్మ్ అయ్యాయి. దీనితో ఒకదాన్ని మించి ఒక సినిమాలో ఎంపిక అవుతూ సేతుపతి తనకి ఇండియన్ సినిమా దగ్గర భారీ డిమాండ్ ఏ లెవెల్లో ఉందో ప్రూవ్ చేసుకుంటున్నాడు.

సంబంధిత సమాచారం :