గేమ్ ఛేంజర్ ట్రైలర్.. ఫ్యాన్స్‌కు ఫుల్ మీల్స్ గ్యారెంటీ!

గేమ్ ఛేంజర్ ట్రైలర్.. ఫ్యాన్స్‌కు ఫుల్ మీల్స్ గ్యారెంటీ!

Published on Jan 2, 2025 5:54 PM IST

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న లేటెస్ట్ సెన్సేషనల్ మూవీ ‘గేమ్ ఛేంజర్’ కోసం అభిమానులు ఎంత ఆసక్తిగా ఎదురుచూస్తున్నారో అందరికీ తెలిసిందే. ఈ సినిమాను దర్శకుడు శంకర్ తెరకెక్కిస్తుండటంతో ఈ మూవీపై అంచనాలు నెక్స్ట్ లెవెల్‌లో క్రియేట్ అయ్యాయి. ఇక ఈ సినిమా నుంచి ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ట్రైలర్‌ను మేకర్స్ తాజాగా రిలీజ్ చేశారు.

‘గేమ్ ఛేంజర్’ ట్రైలర్ ఈ సినిమాపై నెలకొన్న అంచనాలను అమాంతం పెంచేలా కట్ చేశారు మేకర్స్. రామ్ చరణ్ తనదైన పర్ఫార్మెన్స్‌తో ప్రేక్షకులను ఆకట్టుకునేందుకు సిద్ధమైనట్లు మనకు ఈ ట్రైలర్‌లో చూపెట్టారు. ఇక శంకర్ మార్క్ టేకింగ్, సాలిడ్ యాక్షన్ సీక్వెన్స్‌లతో ఈ సినిమా ఆడియెన్స్‌ను థ్రిల్ చేయనుందని ఈ ట్రైలర్ కట్ చూస్తే అర్థమవుతుంది. పవర్‌ఫుల్ పొలిటిక్ డ్రామాగా ఈ సినిమాను మేకర్స్ రూపొందించారు. రామ్ చరణ్ తన పాత్రలో చూపెట్టే వేరియేషన్స్ ఈ ట్రైలర్‌కే హైలైట్‌గా నిలిచాయని చెప్పాలి.

‘గేమ్ ఛేంజర్’లో రామ్ చరణ్ రెండు వైవిధ్యమైన పాత్రల్లో నటిస్తుండటంతో ఈ సినిమాలో ఆయన పర్ఫార్మెన్స్ ఎలా ఉండబోతుందా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు. అందాల భామ కియారా అద్వానీ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాలో ఎస్.జె.సూర్య, శ్రీకాంత్, అంజలి తదితరులు ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. థమన్ సంగీతం ప్రధాన ఆకర్షణగా తెరకెక్కిన ఈ సినిమాను దిల్ రాజు అత్యంత భారీ బడ్జెట్‌తో ప్రొడ్యూస్ చేస్తున్నారు.

వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి

సంబంధిత సమాచారం

తాజా వార్తలు