విజయ్ “లియో” నుంచి సాలిడ్ గ్లింప్స్ రెడీ.!

Published on May 30, 2023 10:08 am IST

ప్రస్తుతం ఇళయ దళపతి విజయ్ హీరోగా దర్శకుడు లోకేష్ కనగ రాజ్ తో భారీ చిత్రం “లియో” చేస్తున్న సంగతి తెలిసిందే. మరి పాన్ ఇండియా లెవెల్లో సాలిడ్ హైప్ ఉన్న ఈ సినిమా షూటింగ్ ఇప్పుడు శరవేగంగా కంప్లీట్ అవుతుండగా మేకర్స్ ఇప్పటికే మంచి అప్డేట్స్ తో ఆడియెన్స్ లో హైప్ ని అలా సెట్ చేసి ఉంచారు. ఇక ఇదిలా ఉండగా దళపతి బర్త్ డే బ్లాస్ట్ కి అయితే రంగం సిద్ధం అవుతున్నట్టుగా ఇప్పుడు టాక్ వినిపిస్తుంది.

ఈ జూన్ లో విజయ్ బర్త్ డే కానుకగా అయితే పోస్టర్ తో పాటుగా సినిమా నుంచి ఫస్ట్ గ్లింప్స్ ని రిలీజ్ చేస్తున్నట్టుగా రూమర్స్ వినిపిస్తున్నాయి. అలాగే ఈ గ్లింప్స్ అయితే సుమారు నిమిషం పాటుగా ఉండేలా కట్ చేసి రిలీజ్ చేస్తున్నట్టుగా బజ్ వినిపిస్తుంది. ఈ సినిమా లోకేష్ సినిమాటిక్ యూనివర్స్ లో భాగమైన సినిమా కావడంతో మామూలు హైప్ లేదు. మరి ఈ గ్లింప్స్ అయితే అధికారిక క్లారిటీ ఇంకా రావాల్సి ఉంది.

సంబంధిత సమాచారం :