షారుఖ్ “పఠాన్” పై సాలిడ్ హైప్..క్రేజీ ప్రమోషన్స్!

షారుఖ్ “పఠాన్” పై సాలిడ్ హైప్..క్రేజీ ప్రమోషన్స్!

Published on Jan 15, 2023 10:00 AM IST

Pathaan 1

బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ హీరోగా బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొనె హీరోయిన్ గా నటించిన లేటెస్ట్ భారీ యాక్షన్ థ్రిల్లర్ చిత్రం “పఠాన్”. స్టార్ నటుడు జాన్ అబ్రహం కూడా నటించిన ఈ చిత్రాన్ని దర్శకుడు సిద్ధార్థ్ ఆనంద్ తెరకెక్కించాడు. మరి ఈ కాంబోలో వస్తున్న సినిమా బాలీవుడ్ లో మళ్ళీ పూర్వ వైభవం తీసుకొస్తుంది అని అంతా అనుకుంటున్నారు. మరి ఇదిలా ఉండగా పఠాన్ కి నెక్స్ట్ లెవెల్లో హైప్ ఇప్పుడు నెలకొంది.

ఆల్రెడి యూఎస్ లో లక్ష డాలర్స్ సేల్స్ జరగ్గా బాలీవుడ్ వర్గాల్లో ఇది హాట్ టాపిక్ గా మారింది. ఇక దీని తర్వాత అయితే మేకర్స్ వరల్డ్ వైడ్ కూడా నెక్స్ట్ లెవెల్ ప్రమోషన్స్ ని చేస్తున్నారు. లేటెస్ట్ గానే వరల్డ్ బిగ్గెస్ట్ హోటల్ బుర్జ్ ఖలీఫా మీద పఠాన్ ట్రైలర్ ని ప్రదర్శించడం వైరల్ గా కూడా మారింది. దీనితో మేకర్స్ అయితే సినిమాకి కావాల్సిన అన్నీ చేస్తున్నారు. మరి ఈ చిత్రం అనుకున్న అంచనాలు అందుకుంటుందో లేదో ఈ జనవరి 25 వరకు ఆగితే తెలిసిపోతుంది.

తాజా వార్తలు