నందమూరి బార్న్ కింగ్ బాలకృష్ణ హీరోగా దర్శకుడు కొల్లి బాబీ తో చేస్తున్న లేటెస్ట్ భారీ చిత్రం “డాకు మహారాజ్” కోసం అందరికీ తెలిసిందే. మరి ఎన్నో అంచనాలు నడుమ రిలీజ్ కి వస్తున్న ఈ సినిమా ఒకో సాంగ్ సహా ఇతర ప్రమోషనల్ కంటెంట్ తో మరింత హైప్ పెంచుకుంటుంది. అయితే ఈ సంక్రాంతిలో వస్తున్నా మరో సినిమా ఇది కాగా ఆల్రెడీ గేమ్ ఛేంజర్ ట్రైయిర్ హిట్ అయ్యింది.
ఇక నెక్స్ట్ డాకు మహారాజ్ ట్రైలర్ రానుంది. ఇది రేపు జనవరి 4న రాబోతున్నట్టుగా టాక్ వినిపిస్తుండగా ఈ ట్రైలర్ పై కూడా సాలిడ్ హైప్ నెలకొంది. మెయిన్ గా మేకర్స్ తమ కంటెంట్ మీదే ఎక్కువ నమ్మకంగా ఉన్నారు. దీనితో డాకు మహారాజ్ ట్రైలర్ కూడా అందరికీ అలరిస్తుంది అని టాక్. ఇక ఈ చిత్రానికి కూడా థమన్ సంగీతం అందిస్తుండగా సితార ఎంటర్టైన్మెంట్స్ అలాగే ఫార్చూన్ ఫోర్ సినిమాస్ వారు కూడా నిర్మాణం వహిస్తున్నారు. అలాగే ఈ జనవరి 12న సినిమా గ్రాండ్ గా రిలీజ్ కాబోతుంది.