కింగ్ నాగ్ “మాస్” రీరిలీజ్ పై కూడా గట్టి హైప్

కింగ్ నాగ్ “మాస్” రీరిలీజ్ పై కూడా గట్టి హైప్

Published on Aug 22, 2024 6:34 PM IST

ప్రస్తుతం మన టాలీవుడ్ సీనియర్ హీరోల హిట్ సినిమాలు రీ రిలీజ్ కి వస్తున్నా సంగతి తెలిసిందే. నేడు మెగాస్టార్ చిరంజీవి బర్త్ డే కానుకగా తన ఇండస్ట్రీ హిట్ చిత్రం “ఇంద్ర” రీ రిలీజ్ కి రాగా ఫ్యాన్స్ భారీ లెవెల్లో ఈ సినిమాని సెలబ్రేట్ చేసుకుంటున్నారు. అయితే ఈ వీక్ తర్వాత నెక్స్ట్ తన ఫ్రెండ్ కో స్టార్ కింగ్ నాగార్జున నటించిన క్రేజీ హిట్ చిత్రం “మాస్” కూడా రాబోతుంది.

దర్శకుడు రాఘవ లారెన్స్ తెరకెక్కించిన ఈ చిత్రం అప్పట్లో నాగ్ స్టామినా రేంజ్ హిట్ గా నిలిచి అదరగొట్టింది. అలాగే మాస్ ఆడియెన్స్ లో తన క్రేజ్ ని మరింత రెట్టింపు చేసిన ఈ చిత్రం ఇప్పుడు రీ రిలీజ్ కి వస్తుండగా దీనిపై ఇప్పుడు సాలిడ్ హైప్ కనిపిస్తుంది. ఖచ్చితంగా నాగ్ అభిమానులు అయితే తెలుగు స్టేట్స్ లో ఈ చిత్రాన్ని గట్టిగానే సెలబ్రేట్ చేసుకునేలా ఉన్నారని ప్రస్తుతానికి ఉన్న బజ్ చూస్తే అనిపిస్తుంది.

ఇలా మన సీనియర్ హీరోస్ లో అయితే నాగ్ సినిమా కూడా అదరగొట్టేలా ఉందని చెప్పాలి. ఇక ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సాలిడ్ మ్యూజిక్ ని అందించగా జ్యోతిక హీరోయిన్ గా నటించింది. అలాగే సునీల్, ప్రకాష్ రాజ్ తదితరులు ఈ చిత్రంలో ముఖ్య పాత్రలు చేశారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు