బిగ్ బాస్ తెలుగు 8 లాంచింగ్ ఎపిసోడ్ కి సాలిడ్ రెస్పాన్స్!

 

ఇటీవల బిగ్ బాస్ తెలుగు 8 వ సీజన్ చాలా గ్రాండ్ గా ప్రారంభం అయ్యింది. ఈ సీజన్ కి కూడా టాలీవుడ్ అగ్ర హీరో, అక్కినేని నాగార్జున హోస్ట్ గా వ్యవహరిస్తున్నారు. ఈ సీజన్ ఓపెనింగ్ ఎపిసోడ్ కి సాలిడ్ రెస్పాన్స్ వచ్చింది.
5.9 బిలియన్ నిమిషాల రికార్డ్ బ్రేకింగ్ వ్యూస్ నమోదు అయినట్లు కింగ్ నాగార్జున సోషల్ మీడియాలో వెల్లడించారు. వినోదం యొక్క శక్తి అంటూ చెప్పుకొచ్చారు. బిగ్ బాస్ తెలుగు 8 వీక్షణ నిమిషాలు మరియు రేటింగ్‌ల రికార్డులను బద్దలు కొట్టింది. బిగ్ బాస్ అద్భుతమైన కొత్త శిఖరాలకు చేరుకునేలా చేసిన మీ ప్రేమను చూసి థ్రిల్‌గా మరియు గౌరవంగా భావిస్తున్నాను. మేము వినోదంలో కొత్త ప్రమాణాలను ఏర్పాటు చేస్తున్నాము. బిగ్ బాస్ తెలుగు 8 డిస్నీ ప్లస్ హాట్ స్టార్ తెలుగులో మరియు స్టార్ మా లో మాత్రమే అని కింగ్ నాగ్ పేర్కొన్నాడు. ఈ ఎపిసోడ్ కి 18.9 రేటింగ్ వచ్చింది.
Exit mobile version