“సరిపోదా శనివారం” టీజర్ అతడి వర్క్ కి సాలిడ్ రెస్పాన్స్

“సరిపోదా శనివారం” టీజర్ అతడి వర్క్ కి సాలిడ్ రెస్పాన్స్

Published on Jul 21, 2024 9:00 AM IST

నాచురల్ స్టార్ నాని హీరోగా యంగ్ అండ్ టాలెంటెడ్ హీరోయిన్ ప్రియాంక మోహన్ హీరోయిన్ గా దర్శకుడు వివేక్ ఆత్రేయ తెరకెక్కిస్తుం లేటెస్ట్ చిత్రమే “సరిపోదా శనివారం”. మరి మొదటి నుంచి కూడా మంచి అంచనాలు ఉన్న ఈ చిత్రం నుంచి మేకర్స్ నిన్న వెర్సటైల్ నటుడు ఎస్ జే సూర్యపై ఇంట్రెస్టింగ్ బర్త్ డే టీజర్ ని వదిలారు. అయితే ఈ టీజర్ లో నాని, ఎస్ జే సూర్యల మాస్ ఒకెత్తు అయితే ఆ టీజర్ లో బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా మరో ఎత్తు అని చెప్పాలి.

ఈ సినిమాకి టాలెంటెడ్ సంగీత దర్శకుడు జేక్స్ బిజోయ్ సంగీతం అందించగా ఇప్పుడు ఈ టీజర్ లో తన వర్క్ కోసమే అంతా మాట్లాడుకుంటున్నారు. ఇతర హీరోల అభిమానులు తమ హీరోస్ పై ఎడిట్స్ కూడా మొదలు పెట్టారు. ఇలా క్రేజీ లెవెల్లో అయితే సరిపోదా శనివారం ఇప్పుడు హిట్ అయ్యింది. జేక్స్ బిజోయ్ చేసిన సినిమాల్లో దుల్కర్ సల్మాన్ తో చేసిన “కింగ్ ఆఫ్ కొత్త” సినిమా స్కోర్ కి కూడా చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు. మరి సినిమా రిలీజ్ అయ్యాక ఎలా ఉంటుందో చూడాలి. ఇక ఈ చిత్రాన్ని డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ నిర్మాణం వహిస్తుండగా ఈ ఆగస్ట్ 29న పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ కి తీసుకు రాబోతున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు