తెలుగులో సాలిడ్ రెస్పాన్స్ తో విజయ్ సేతుపతి “మహారాజ”

తెలుగులో సాలిడ్ రెస్పాన్స్ తో విజయ్ సేతుపతి “మహారాజ”

Published on Jun 15, 2024 8:04 AM IST

టాలెంటెడ్ అండ్ వెర్సటైల్ నటుడు విజయ్ సేతుపతి హీరోగా నురాగ్ కశ్యప్, మమతా మోహన్ దాస్, నట్టి (నటరాజ్), భారతీరాజా, అభిరామ్, సింగంపులి తదితరులు ముఖ్య పాత్రల్లో దర్శకుడు నిథిలన్ స్వామినాథన్ దర్శకత్వంలో తెరకెక్కించిన లేటెస్ట్ ఎమోషనల్ అండ్ రివెంజ్ యాక్షన్ డ్రామా “మహారాజ”. మరి మంచి సినిమాకి తక్కువ ప్రమోషన్స్ ఉన్నప్పటికీ తెలుగు ప్రజలు ఆదరిస్తారు అనేదానికి ఈ చిత్రం మరో నిదర్శనం అని చెప్పాలి.

తమిళ్ సహా తెలుగులో కూడా ఈ చిత్రానికి ప్రీమియర్స్ నుంచే మంచి రెస్పాన్స్ రాగా ఇప్పుడు ఈ సినిమా తెలుగులో మరింత రెస్పాన్స్ ని అందుకున్నట్టుగా తెలుస్తుంది. తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు ఈ సినిమాకి మరిన్ని స్క్రీన్స్ కేటాయించడమే కాకుండా డే 2 కి బుకింగ్స్ కూడా బాగా పికప్ అయినట్టుగా తెలుస్తుంది. మొత్తానికి అయితే విజయ్ సేతుపతి తన కెరీర్ 50వ సినిమాని మంచి హిట్ గా అందుకున్నాడని చెప్పాలి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు