నందమూరి నటసింహం బాలకృష్ణ హీరోగా తన కెరీర్ 109వ చిత్రాన్ని దర్శకుడు కొల్లి బాబీతో చేస్తున్న సంగతి తెలిసిందే. “డాకు మహారాజ్” అంటూ చేసిన ఈ మాస్ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. మరి ఇదిలా ఉండగా ఈ చిత్రం షూటింగ్ ని కూడా బాలయ్య ఆల్రెడీ పూర్తి చేసేసుకునట్టుగా తెలుస్తుంది.
అయితే ఈ సినిమా రిలీజ్ కోసం అభిమానులు చాలా ఎగ్జైటింగ్ గా కూడా ఎదురు చూస్తుండగా ఈ సినిమా తర్వాత బాలయ్య నుంచి సెన్సేషనల్ సీక్వెల్ “అఖండ 2” రాబోతుంది. మరి దర్శకుడు బోయపాటి శ్రీనుతో బాలయ్య చేస్తున్న ఈ సెన్సేషనల్ ప్రాజెక్ట్ పై కూడా భారీ హైప్ ఉండగా బాలయ్య అలా డాకు మహారాజ్ పూర్తి చేసిన వెంటనే అఖండ 2 లోకి దిగిపోయినట్టు తెలుస్తుంది.
దీనితో వెంటనే అఖండ 2 పనులని తాను స్టార్ట్ చేసేసారు అని చెప్పాలి. ఇక ఇదిలా ఉండగా మేకర్స్ కూడా ఈరోజు సాయంత్రం 5 గంటల 31 నిమిషాలకి ఓ క్రేజీ అప్డేట్ ఇస్తున్నట్టుగా నిర్మాణ సంస్థ 14 రీల్ ఎంటరైన్మెంట్స్ వారు తెలిపారు. మరి ఈ సెన్సేషనల్ సీక్వెల్ కోసం కూడా అభిమానులు ఓ రేంజ్ లో ఎదురు చూస్తున్నారు. ప్రస్తుతానికి తన డాకు మాహారాజ్ మాత్రం వచ్చే ఏడాది జనవరి 12న రిలీజ్ కి తీసుకొస్తున్నారు.
A Roaring update from #Akhanda2 – Thaandavam today at 5:31 PM ❤????
Stay tuned ????????
'GOD OF MASSES' #NandamuriBalakrishna #BoyapatiSreenu @MusicThaman @14ReelsPlus @RaamAchanta #GopiAchanta #MTejeswiniNandamuri @kotiparuchuri pic.twitter.com/Tze8CKmgAO
— 14 Reels Plus (@14ReelsPlus) December 11, 2024