ఒకట్రెండు రోజుల్లో ‘ఆయుధపూజ’ సాంగ్

మ్యాన్ ఆఫ్ మాసెస్ జూ.ఎన్టీఆర్ నటించిన లేటెస్ట్ మూవీ ‘దేవర’ మరో పది రోజుల్లో వరల్డ్‌వైడ్ రిలీజ్‌కి రెడీ అయ్యింది. ఈ సినిమాను దర్శకుడు కొరటాల డైరెక్ట్ చేస్తుండగా పూర్తి యాక్షన్ డ్రామాగా ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకునేందుకు సిద్ధమైంది. ఇక ఇప్పటికే రిలీజ్ అయిన ఈ మూవీ పోస్టర్స్, టీజర్, ట్రైలర్, సాంగ్స్‌కి విశేషమైన రెస్పాన్స్ దక్కింది.

ఇక ఈ సినిమాకు సంబంధించిన ప్రమోషన్స్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతున్నాయి. అయితే, ఈ సినిమాకు సంబంధించిన ఆడియో లాంఛ్ ప్రస్తుతం చెన్నైలో గ్రాండ్‌గా నిర్వహించేందుకు మేకర్స్ రెడీ అయ్యారు. ఈ ఈవెంట్‌కు చిత్ర యూనిట్ హాజరవుతున్నారు. అయితే, ఈ చిత్ర లిరిసిస్ట్ రామ జోగయ్య శాస్త్రి కూడా ఈ ఈవెంట్‌కు హాజరవుతున్నారు. ఈ క్రమంలోనే ఆయన ‘ఆయుధపూజ’ రేపు లేదా ఎల్లుండి రాబోతున్నట్లు తెలిపారు.

ఈ అప్డేట్‌తో అభిమానులు థ్రిల్ అవుతున్నారు. ఇక ఈ పాట ఈ చిత్రానికే హైలైట్‌గా ఉండబోతుందని మేకర్స్ చెబుతున్నారు. మరి ఈ సాంగ్ ఎప్పుడు రిలీజ్ అవుతుందా.. ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తుందా అని అభిమానులు ఆసక్తిగా చూస్తున్నారు.

Exit mobile version