పవన్ “ఓజి” పై సాలిడ్ అప్డేట్.!

Published on Mar 29, 2023 8:00 am IST

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా ఇప్పుడు నటిస్తున్న లేటెస్ట్ చిత్రాల్లో ఆల్రెడీ ఓ సినిమాని అయితే తాను కంప్లీట్ చేసేసారు. ఇక నెక్స్ట్ ఉస్తాద్ భగత్ సింగ్ లో జాయిన్ కానుండగా పవన్ ఫ్యాన్స్ అయితే అమితంగా ఆసక్తి కనబరుస్తున్న రెండు సినిమాలు అయితే చివరలో స్టార్ట్ కానున్నాయి. మరి ఈ చిత్రాలే ఒకటి భారీ పాన్ ఇండియా సినిమా “హరిహర వీరమల్లు” కాగా మరో చిత్రం యంగ్ అండ్ టాలెంటెడ్ దర్శకుడు సుజీత్ తో ప్లాన్ చేసిన క్రేజీ సాలిడ్ యాక్షన్ థ్రిల్లర్ చిత్రం “ఓజి”.

ది ఒరిజినల్ గ్యాంగ్ స్టర్ గా ప్లాన్ చేస్తున్న ఈ సినిమాపై ఇపుడు క్రేజీ టాక్ అయితే తెలుస్తుంది. మేకర్స్ ఈ సినిమాని ఓన్లీ తెలుగు లోనే కాకుండా పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ చేయాలని డిసైడ్ అయ్యారట. మరి అందులో భాగంగానే నిర్మాత డీవీవీ దానయ్య కూడా సినిమా టైటిల్ ని అయితే పాన్ ఇండియా భాషల్లో రిజిస్టర్ చేసినట్టుగా ఇంట్రెస్టింగ్ టాక్ ఇప్పుడు వినిపిస్తుంది. దీనితో అయ్యితే పవన్ నుంచి రెండు పాన్ ఇండియా సినిమాలు రానున్నాయని చెప్పాలి.

సంబంధిత సమాచారం :