“హను మాన్” ఓఎస్టీ పై సాలిడ్ అప్డేట్ ఇచ్చిన సంగీత దర్శకుడు.!

“హను మాన్” ఓఎస్టీ పై సాలిడ్ అప్డేట్ ఇచ్చిన సంగీత దర్శకుడు.!

Published on Aug 23, 2024 10:30 AM IST


యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో తేజ సజ్జ హీరోగా అమృత అయ్యర్ హీరోయిన్ గా దర్శకుడు ప్రశాంత్ వర్మ తెరకెక్కించిన లేటెస్ట్ సినిమా “హను మాన్” కోసం అందరికీ తెలిసిందే. మరి మన తెలుగు సినిమా నుంచి మొదటి సూపర్ హీరో సినిమాగా వచ్చి భారీ విజయాన్ని ఈ చిత్రం నమోదు చేసింది.

అయితే ఈ చిత్రానికి ఉన్న మేజర్ ప్లస్ పాయింట్స్ లో టాలెంటెడ్ సంగీత దర్శకుడు గౌర హరీష్ ఇచ్చిన పాటలు కానీ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ సినిమాని ఏ లెవెల్లో ఎలివేట్ చేశాయో అందరికీ తెలిసిందే. ఆ మధ్య సినిమాలో కొన్ని ట్రాక్స్ కి అయితే భారీ క్రేజ్ కూడా ఏర్పడింది. మరి తాజాగా గౌర హరీష్ ఈ సినిమా ఓఎస్టీ(ఒరిజినల్ సౌండ్ ట్రాక్) పై సాలిడ్ అప్డేట్ అందించాడు.

తమ హను మాన్ తేజ సజ్జ బర్త్ డే కానుకగా ఒక బిట్ ని మొదటిగా వదిలి దీని తర్వాత మరిన్ని ట్రాక్ లు రానున్నాయని తాను తెలిపాడు. అలాగే 4 ఎక్స్టెండెడ్ ట్రాక్స్ ని తేజ సజ్జ బర్త్ డే కానుకగా అందించనున్నానని తెలిపాడు. మొత్తానికి అయితే హను మాన్ మ్యూజిక్ లవర్స్ కి ఇది గుడ్ న్యూస్ అని చెప్పాలి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు