‘సోలో’ – ఒక ఒంటరి ప్రయాణం

త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నారా రోహిత్ లేటెస్ట్ మూవీ ‘సోలో – ద సోలిడ్ లవ్ స్టొరీ’. శక్తి వంతమైన ఫ్యామిలీ డ్రామా తో మిళితమైన రొమాంటిక్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా ఈ చిత్రం ఉండబోతుంది. ఈ మూవీ కి సంబంధించిన విశేషాలు డైరెక్టర్ పరశురాం మాటల్లో .. వెనకా ముందూ ఎవరూలేని ఓ యువకుడు తను ప్రేమించిన అమ్మాయిని ఆమె కుటుంబ సభ్యుల అనుమతి తోనే దక్కిచుకోవాలని ఆశపడతాడు. “అనాధ గా ఈ ప్రపంచంలోకి అడుగిడిన హీరో, ఒంటరిగానే ఈ సమాజంలో మిగిలిపోకూడదనుకుంటాడు.” అంటున్నారు పరశురాం.

నారా రోహిత్ – నిషా అగర్వాల్ హీరో, హీరోయిన్లుగా నటించిన ఈ సినిమా నవంబర్ 24 న విడుదలకాబోతుంది. ప్రకాష్ రాజ్ – జయసుధ ఈ చిత్రంలో ముఖ్య భూమిక వహించనున్నారు. ఇటీవల విడుదలైన ఈ మూవీ ఆడియో కు విశేష స్పందన లభిస్తోంది. ఈ చిత్రానికి మణిశర్మ స్వరాలూ సమకూర్చారు.

పోస్ట్ ప్రొడక్షన్ పనులు యుద్ద ప్రాతిపదికన జరుపుకుంటున్న ఈ సినిమాను వంశీ కృష్ణ శ్రీనివాస్ నిర్మిస్తున్నారు.

Sent at 10:28 AM on Tuesday

Exit mobile version