“కేజీయఫ్ 2” విడుదలపై కన్ఫ్యూజన్.?

Published on Jan 22, 2021 7:04 pm IST


ఇప్పుడు మన సౌత్ నుంచి వస్తున్న సెన్సేషనల్ ప్రాజెక్ట్ “కేజీయఫ్ చాప్టర్ 2” సినిమా కోసం ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. చాప్టర్ 1 మైండ్ బ్లోయింగ్ హిట్ కావదంతి చాప్టర్ 2 పై కనీ వినీ ఎరుగని స్థాయి అంచనాలు నెలకొన్నాయి. మరి వీటితో పాటుగా తాజాగా వచ్చిన టీజర్ తో ఆ అంచనాలు మరింత స్థాయిలో పెరిగిపోయాయి.

ఇక ఇక్కడ నుంచి ఇండియన్ వైడ్ ప్రేక్షకులు ఈ భారీ యాక్షన్ థ్రిల్లర్ ను ఎట్టి పరిస్థితుల్లోనూ త్వరగా చూసెయ్యాలని ఉవ్విళ్లూరుతున్నారు. అయితే మరి ఈ సినిమా విడుదల విషయంలో ఇప్పుడు కాస్త కన్ఫ్యూజన్ నెలకొంది. ఎందుకంటే ఇప్పుడు ఈ సినిమాను ఎప్పుడు విడుదల చెయ్యాలి అన్న దానిపై రెండు వెర్షన్స్ వినిపిస్తున్నాయి.

మొదటి దాని ప్రకారం ఈ సాలిడ్ సినిమాను అనుకున్న సమయం ప్రకారమే జూలై 30 న విడుదల అవుతుంది అని వినిపిస్తుండగా మరో టాక్ ప్రకారం ఇంకాస్త ముందు గానే అంటే మే 30న పర్ఫెక్ట్ వేసవి ట్రీట్ గా విడుదల చేయనున్నారని వినిపిస్తుంది. మరి ఈ రెండిట్లో ఏది ఖరారు అవుతుందో కాలమే నిర్ణయించాలి. ఇక ఈ భారీ చిత్రంలో సంజయ్ దత్, ప్రకాష్ రాజ్, శ్రీనిధి శెట్టి, అలాగే రవీనా టండన్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

సంబంధిత సమాచారం :