హైదరాబాద్లో శాశ్వతంగా మూతబడిన పాపులర్ థియేటర్లు

Published on Nov 25, 2020 10:05 pm IST


లాక్ డౌన్ అనంతరం సినిమా హాళ్లను ఓపెన్ చేయవచ్చని తెలంగాణ ప్రభుత్వం అనుమతులిచ్చింది. డిసెంబర్ నెలలో హాళ్లు తెరుచుకునే వీలుంది. దీంతో సినీ ప్రేమికులు ఖుషీ అయ్యారు. ఇదిలా ఉంటే సినీలోని కొన్ని ప్రముఖ సింగిల్ స్క్రీన్ థియేటర్లు శాశ్వతంగా మూతబడ్డాయనే వార్త ప్రేక్షకులను నిరుత్సాహానికి గురిచేస్తోంది. సిటీలోని పలు సింగిల్ స్క్రీన్ థియేటర్లకు ప్రత్యేకమైన పేరుంది. ప్రధానంగా మాస్ ఆడియన్స్ కు ఈ థియేటర్లతో ప్రత్యేక అనుబంధం ఉంటుంది.

అలాంటి థియేటర్లలో 5 థియేటర్లు శాశ్వతంగా మూతబడ్డాయి. వాటిలో నారాయణగుడలోని శాంతి థియేటర్, టోలీచౌకీలోని గాలక్సీ థియేటర్, బహదూర్ పురాలోని శ్రీరామ థియేటర్, ఆర్టీసీ క్రాస్ రోడ్స్ నందు ఉన్న శ్రీమయూరీ థియేటర్, మెహిదీపట్నంలోని అంబా థియేటర్ శాశ్వతంగా మూతబడినట్టు తెలుస్తోంది. వీటిలో కొన్నిటిని గొడౌన్లుగాను, ఇంకొన్నిటిని ఇతర వ్యాపార అవసరాల కోసం వినియోగించనున్నారట. దశాబ్దాల చరిత్ర కలిగిన ఈ సింగిల్ స్క్రీన్ థియేటర్లు ఇలా లాక్ డౌన్ ఎఫెక్ట్ మూలాన మూతబడటం కలవరపరిచే విషయమే.

సంబంధిత సమాచారం :

More