వేదిక ఏదైనా నా పని అదే – సోనాక్షి సిన్హా

బాలీవుడ్‌ హీరోయిన్ సోనాక్షి సిన్హా రీసెంట్ గా తన ప్రియుడితో ఏడడుగులు వేసిన సంగతి తెలిసిందే. ఐతే, ఈ భామ.. తాజాగా ‘కాకుడా’ అనే హారర్‌ కామెడీతో ప్రేక్షకులను అలరిస్తోంది. ఈ సందర్భంగా ఓ ఇంటర్వ్యూలో సోనాక్షి సిన్హా మాట్లాడుతూ.. ‘నిజానికి నాకు హారర్‌ చిత్రాలంటే ఇష్టముండదు. అందుకే ఎప్పుడూ ఆ చిత్రాలు చేయడానికి ప్రయత్నించలేదు. కాకపోతే, మొదటిసారి ‘కాకుడా’ స్క్రిప్ట్‌ చదువుతుంటే నాకు బాగా సరదాగా అనిపించింది. బాగా ఎంజాయ్ చేశాను’ అని సోనాక్షి సిన్హా చెప్పింది.

సోనాక్షి సిన్హా ఇంకా మాట్లాడుతూ.. ‘ప్రేక్షకులు కూడా ఎంజాయ్ చేస్తారని నమ్మి ఈ సినిమా చేశాను. ఇందులో కామెడీ సన్నివేశాలు నాకు చాలా బాగా నచ్చాయి. దర్శకుడికి కూడా ఈ జానర్‌ పై పట్టు ఉంది. అసలు ప్రేక్షకులను ఎక్కడ భయపెట్టాలో.. ఎక్కడ నవ్వించాలో ఈ చిత్ర దర్శకుడికి చాలా బాగా తెలుసు. అలాంటి దర్శకుడితో తొలిసారి పని చేయడం ఆనందంగా ఉంది. నేను పరిశ్రమకు వచ్చి 14 ఏళ్లు పూర్తి చేసుకోబోతున్నాను. వేదిక ఏదైనా నటించడమే నా పని. ఓటీటీ, థియేటర్‌ అంటూ నాకేమీ తేడాలు లేవు’ అంటూ సోనాక్షి సిన్హా తెలిపింది.

Exit mobile version