బిటౌన్ లో సోనాక్షి పెళ్లి వార్త‌లు.. వ‌రుడు ఎవరంటే..?

బిటౌన్ లో సోనాక్షి పెళ్లి వార్త‌లు.. వ‌రుడు ఎవరంటే..?

Published on Jun 10, 2024 3:59 PM IST


బాలీవుడ్ లో ప్ర‌స్తుతం హీరోయిన్ సోనాక్షి సిన్హా తెగ ట్రెండ్ అవుతోంది. ఆమె త్వ‌ర‌లోనే పెళ్లిపీట‌లెక్క‌నుంద‌నే వార్త ఇప్పుడు బిటౌన్ లో హాట్ టాపిక్ గా మారింది. గ‌తంలోనూ ఆమె పెళ్లిపై ప‌లుమార్లు వార్త‌లొచ్చినా, ఈసారి ఆమె ఖ‌చ్చితంగా పెళ్లి చేసుకుంట‌ద‌ని బాలీవుడ్ మీడియా కోడై కూస్తోంది.

ఆమె గ‌త‌కొంత కాలంగా న‌టుడు జ‌హీర్ ఇక్బాల్ తో ప్రేమ‌లో ఉన్న సంగతి తెలిసిందే. అయితే, వీరికి సంబంధించిన ప‌లు ఫోటోలు సోష‌ల్ మీడియాలో ట్రెండ్ అయ్యాయి. కాగా, సోనాక్షి-జ‌హీర్ ల వివాహం జూన్ 23న అంగ‌రంగ వైభవంగా జ‌ర‌గ‌నున్న‌ట్లు తెలుస్తోంది. ఇప్ప‌టికే వారి వివాహ వేడుక‌కు సంబంధించిన ఏర్పాట్లు జ‌రుగుతున్నాయని బాలీవుడ్ మీడియా చెబుతోంది.

సోనాక్షి, జ‌హీర్ ల వివాహానికి సంబంధించిన వివాహ‌ప‌త్రిక ఇప్ప‌టికే బాలీవుడ్ ప్ర‌ముఖులంద‌రికీ చేరింద‌ని.. వారంద‌రూ సోనాక్షి వివాహానికి హాజ‌రు కానున్నార‌ని వార్త‌లు వ‌స్తున్నాయి. మ‌రి ఈ వార్త‌ల్లో ఎంత‌వ‌ర‌కు నిజం ఉంద‌నే విష‌యంపై ఈ ఇరువురిలో ఒక‌రు క్లారిటీ ఇచ్చే వ‌ర‌కు వెయిట్ చేయాల్సిందే అంటున్నారు అభిమానులు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు