టాలీవుడ్‌లో తెరకెక్కుతున్న పాన్ ఇండియా ప్రాజెక్ట్‌లలో సుధీర్ బాబు నటిస్తున్న ‘జటాధర’ కూడా ఒకటి. ఈ సినిమాను దర్శకుడు వెంకట్ కళ్యాణ్ ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నాడు. ఇక ఈ సినిమాను భారీ బడ్జెట్‌తో రూపొందిస్తుండగా బాలీవుడ్ భామ సోనాక్షి సిన్హా ఈ మూవీతో టాలీవుడ్ ఎంట్రీ ఇస్తోంది.
ఇప్పటికే శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాపై సోనాక్షి ఓ సాలిడ్ అప్డేట్ ఇచ్చింది. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం రెండో షెడ్యూల్ జరుగుతుందని.. అయితే, ఈ రెండో షెడ్యూల్ షూట్ కూడా ముగించుకున్నట్లు ఆమె తన సోషల్ ఖాతాలో పోస్ట్ చేసింది. ఇలాంటి చిత్రంలో నటిస్తున్నందుకు సంతోషంగా ఉందంటూ ఆమె పేర్కొంది.
ఇక త్వరగా ఈ మూవీ నెక్స్ట్ షెడ్యూల్‌లో జాయిన్ కావాలని ఆమె కోరుకుంది. ఈ సినిమాతో ఆమె టాలీవుడ్‌లో సాలిడ్ ఎంట్రీ ఇవ్వాలని అభిమానులు కోరుతున్నారు.