‘జటాధర’ కోసం సోనాక్షి ముగించేసిందిగా!

‘జటాధర’ కోసం సోనాక్షి ముగించేసిందిగా!

Published on Apr 9, 2025 1:00 AM IST

టాలీవుడ్ హీరో సుధీర్ బాబు నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘జటాధర’ ఇప్పటికే ప్రేక్షకుల్లో సాలిడ్ అంచనాలు క్రియేట్ చేసింది. ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్స్ ఆకట్టుకునేలా ఉండటంతో ఈ మూవీ ఎలా ఉండబోతుందా అనే ఆసక్తి నెలకొంది. ఇక ఈ సినిమాను పాన్ ఇండియా చిత్రంగా భారీ స్థాయిలో తెరకెక్కిస్తున్నారు మేకర్స్. కాగా, ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ సోనాక్షి సిన్హా తొలిసారి ఓ తెలుగు చిత్రంలో నటిస్తోంది.

ఇప్పటికే ఈ చిత్ర షూటింగ్‌లో ఆమె పాల్గొంటుంది. కాగా, తాజాగా ఈ చిత్ర షూటింగ్‌పై సోనాక్షి ఓ సాలిడ్ అప్డేట్ అయితే ఇచ్చింది. ఈ సినిమాలో తన పాత్రకు సంబంధించిన షూటింగ్ పూర్తయ్యిందని.. తను ఈ సినిమా షూటింగ్‌ను ముగిస్తున్నట్లు సోనాక్షి తాజాగా తన ఇన్‌స్టా పేజీలో పోస్ట్ చేసింది. ఈ సినిమాలో తన పాత్ర అద్భుతంగా ఉందని.. తన తొలి తెలుగు సినిమా షూటింగ్ పూర్తి చేసుకోవడం సంతోషంగా ఉందని ఆమె పేర్కొంది.

ఇక ఈ సినిమాతో సోనాక్షి టాలీవుడ్‌లో సాలిడ్ ఎంట్రీ ఇచ్చేందుకు ప్రయత్నిస్తుంది. వెంకట్ కళ్యాణ్ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాను శివిన్ నారంగ్, ప్రేరణ అరోరా, నిఖిల్ నంద, ఉజ్వల్ ఆనంద్ సంయుక్తంగా ప్రొడ్యూస్ చేస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు