అభిమాని సూసైడ్‌ పై ఎమోషనలైన సోనాలి

అభిమాని సూసైడ్‌ పై ఎమోషనలైన సోనాలి

Published on Jun 18, 2024 2:01 AM IST

హీరోయిన్ సోనాలి బింద్రే ఒకప్పుడు అగ్ర హీరోల సరసన నటించి ఎంతోమంది అభిమానులను సొంతం చేసుకుంది. ఇక కొంతకాలం నటనకు దూరంగా ఉన్న ఆమె, ఇటీవలే సెకండ్‌ ఇన్నింగ్స్‌ కూడా మొదలు పెట్టింది. ఐతే, తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో సోనాలి బింద్రే ఫ్యాన్స్‌ కల్చర్‌ గురించి షాకింగ్ కామెంట్స్ చేశారు.

సోనాలి బింద్రే మాట్లాడుతూ.. ‘అభిమాన హీరోయిన్‌ను చూడలేకపోయినందుకు ప్రాణాలు తీసుకోవడం అనేది బాధాకరమైన విషయం. గతంలో ఓ అభిమాని నన్ను కలవలేకపోయినందుకు బాధ పడి చెరువులో దూకి సూసైడ్‌ చేసుకున్నారు. ఇది చాలా దారుణం. అలాగే, నాకు కొన్ని మెయిల్స్‌, ఉత్తరాలు వచ్చేవి. కొందరు వాటిని రక్తంతో రాసేవారు. అవి చూసి ఆశ్చర్యపోయేదాన్ని. చాలా బాధేసేది. అభిమానించడం తప్పు కాదు. కానీ ఇలా చేయడం తప్పు’ అని సోనాలి బింద్రే చెప్పుకొచ్చింది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు