పండంటి మగబిడ్డకు జన్మనిచ్చిన స్టార్ హీరోయిన్ !

పండంటి మగబిడ్డకు జన్మనిచ్చిన స్టార్ హీరోయిన్ !

Published on Aug 20, 2022 7:00 PM IST

బాలీవుడ్‌ హీరోయిన్‌ సోనమ్‌ కపూర్‌ శనివారం ఉదయం పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. ఈ విషయాన్ని ఆమె స్వయంగా తనకు కొడుకు పుట్టాడంటూ ఇన్‌ స్టాగ్రామ్‌ వేదికగా ప్రకటించింది. ‘ఆగస్టు 20, 2022.. ముద్దులొలుకుతున్న బాబు మా జీవితాల్లోకి వచ్చాడు. డాక్టర్స్, నర్సులు, అలాగే నా ఫ్యామిలీ మెంబర్స్, ఫ్రెండ్స్.. ఈ జర్నీలో నాకు తోడ్పడిన ప్రతి ఒక్కరికీ నా ధన్యవాదాలు అని మెసేజ్ చేసింది.

అలాగే, ఇది ప్రారంభం మాత్రమే, బాబు రాకతో మా ప్రపంచమే మారిపోయింది అంటూ సోనమ్‌, తన భర్త ఆనంద్‌ తో కలిసి ఈ పోస్ట్ పెట్టింది. ఇక సోనమ్‌ కపూర్‌ కి కుమారుడు పుట్టడంతో ఆమె అభిమానులు తమ సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. సోనమ్, ఆనంద్‌ అహుజాలు 2018 మేలో పెళ్లి చేసుకున్నారు. ఆ మధ్య లండన్‌ లో సోనమ్ తన సీమంతాన్ని కూడా గ్రాండ్ గా జరుపుకుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు