ఈ ఓటిటిలో స్ట్రీమింగ్ కి వచ్చేసిన థ్రిల్లర్ 7/జి

యూత్ ఫుల్ సెన్సేషనల్ హిట్ 7/జి బృందావన కాలనీ సినిమా హీరోయిన్ సోనియా అగర్వాల్ కోసం అందరికీ తెలిసిందే. ఆమెతో పాటుగా స్మృతి వెంకట్ లీడ్ రోల్స్ నటించిన టెర్రిఫిక్ హారర్ థ్రిల్లర్ సినిమానే 7/జి. హరూన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం తమిళ్ లో సూపర్ హిట్ అయ్యింది. రాజీవ్, వర్ష అనే దంపతులు ఐదేళ్ల కొడుకు రాహుల్‌తో కలసి కొత్త ఫ్లాట్‌కి మారుతారు. అక్కడ వర్ష పారానార్మల్ యాక్టివిటీస్ ని ఎదుర్కొంటుంది.

వారి ఇంటిని, కుటుంబాన్ని కాపాడుకోవడానికి అతీంద్రియ శక్తులతో వర్ష ఎలాంటి పోరాటం చేసిందనే చాలా ఎక్సయిటింగ్ స్క్రీన్ ప్లే తో ఆడియన్స్ ను సీట్ ఎడ్జ్ లో ఉంచే థ్రిల్లర్ గా చూపించారు. ఇప్పుడీ చిత్రం అందరి ఫేవరేట్ ఆహా ఓటీటీలో భవానీ మీడియా ద్వారా డిసెంబర్ 12 నుంచి స్ట్రీమింగ్ కానుంది. ప్రేక్షకులని కట్టిపడేసే ఈ హారర్ థ్రిల్లర్ ఇపుడు మన తెలుగు స్ట్రీమింగ్ యాప్ ఆహా నేటి నుంచి స్ట్రీమ్ అవుతుంది. మరి ఈ చిత్రాన్ని చూడాలి అనుకుంటే ఆహాలో ట్రై చేయవచ్చు.

Exit mobile version