ఆ నటుడు పై లైంగిక ఆరోపణలు నిజమే – నటి క్లారిటీ

కొందరు నటీమణులు మలయాళ సినీ రంగంలో ఎదుర్కొంటున్న ఇబ్బందికర పరిస్థితులపై జస్టిస్‌ హేమ కమిటీ ఓ రిపోర్ట్‌ సిద్ధం చేసింది. ఐతే, ప్రస్తుతం ఈ రిపోర్ట్ మలయాళ పరిశ్రమను షాక్ కి గురి చేస్తోంది. ముఖ్యంగా మలయాళ దర్శక – నిర్మాతలలో కొందరి పై పలువురు నటీమణులు లైంగిక ఆరోపణలు చేస్తూ సంచలన విషయాలను బయట పెడుతున్నారు. ఈ క్రమంలోనే మలయాళ నటుడు జయసూర్య పై నటి సోనియా మల్హర్‌ లైంగిక ఆరోపణలు చేసింది.

తాజాగా తన ఆరోపణలపై చేసిన వ్యాఖ్యలు నిజమేనని సోనియా మల్హర్‌ స్పష్టం చేసింది. ‘నా మాటల్లో నిజం లేదని ఆయన అంటున్నారు. నావి తప్పుడు ఆరోపణలు కాదు. స్పష్టంగా చెబుతున్నా.. నా వ్యాఖ్యల్లో నిజం ఉంది. నా జీవితంలో మొదటిసారి పోలీసులకు ఫిర్యాదు చేసింది ఇప్పుడే. ఈ కేసు నేను క్లోజ్‌ చేయాలనుకోవడం లేదు. తప్పకుండా న్యాయపోరాటం చేస్తా’’ అని సోనియా చెప్పుకొచ్చింది.

Exit mobile version