ఇప్పుడు సోనూ పేరు మన దేశంలో ఎవరికీ పరిచయం అక్కరలేని పేరు. కేవలం సినీ నటునిగా చాలా మందికి తెలిసి ఉన్నప్పటికీ గొప్ప మానవతావాదిగా మాత్రం ఇపుడు యావత్తు భారతావళి మొత్తానికి చేరువయ్యాడు ఈ రియల్ హీరో. తన సొంత డబ్బులతో లాక్ డౌన్ సమయంలో లక్షలాది మంది సామాన్య ప్రజలను ఆదుకున్నాడు.
బస్సులు, స్పెషల్ ట్రైన్స్, విమానాల్లో సైతం తమ స్వస్థలాలకు లాక్ డౌన్ లో పంపి రియల్ హీరో అనిపించుకున్నాడు. కేవలం అక్కడితో కాకుండా దేశం నలుమూలల్లో ఎవరికి ఏ సాయం కావాలి అన్నా చేసి పెట్టాడు. అందుకే ఇపుడు గొప్ప మానవతావాదిగా ప్రపంచ ప్రసిద్ధి ఐక్యరాజ్యసమితి చేత సత్కారం పొందాడు.
అయితే ఇలాంటి అవార్డును ఇప్పటివరకు అతి కొద్ది మంది హాలీవుడ్ స్టార్స్ మాత్రమే పొందారు. టైటానిక్ హీరో లియోనార్డో డికాప్రియో, ఏంజెలినా జోలీ లాంటి నటుల తర్వాత మన దేశం నుంచి సోనూ సూద్ ఈ అరుదైన గౌరవాన్ని దక్కించుకున్నాడు. అయితే సోనూ సూద్ కంటే ముందు మరో స్టార్ నటి ప్రియాంకా చోప్రా కూడా ఈ అవార్డును అందుకుంది.