‘ఆచార్య’లో సోనూ సూద్ పార్ట్ పూర్తయింది !

Published on Nov 29, 2020 10:11 pm IST

కొరటాల శివ దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న కొత్త చిత్రం ‘ఆచార్య’. లాక్ డౌన్ అనంతరం ఇటీవలే ఈ సినిమా షూట్ రీస్టార్ట్ అయింది. ఈ నెల 20 నుండి మెగాస్టార్ కూడా సెట్స్ మీదకి వచ్చిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం కొరటాల ఇతర తారాగణంతో కీలక సన్నివేశాలను తెరకెక్కిస్తున్నారు. కాగా ఈ సినిమాలో సోనూ సూద్ కూడ ఒక కీలక పాత్ర చేస్తున్నారు. పది రోజుల క్రితమే చిత్రీకరణలో పాల్గొన్న సోనూ సూద్ పాత్రకు సంబంధించిన పార్ట్ మొత్తం నేటితో పూర్తి అయిందని తెలుస్తోంది. ఇక ఈ చిత్రంలో సోనూ పాత్ర కేవలం ఆర్డినరీ పాత్రలా కాకుండా మంచి ప్రాముఖ్యతను కలిగి ఉంటుందని తెలుస్తోంది

ఇక్ ఈ సినిమాలో మెగాస్టార్ సరసన కాజల్ హీరోయిన్ గా నటిస్తోంది. కాగా మెగాస్టార్ ఈ చిత్రం కోసం బరువు తగ్గడంతో పాటు లుక్ ను కూడా మార్చారు. అన్నట్టు ఈ చిత్రంలో రెజీనా ఓ సాంగ్ లో కనిపించనుంది. ఇక ఈ చిత్రంలో రామ్ చరణ్ మాజీ నక్సలైట్ గా కనిపిస్తారట. కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్ లో రామ్ చరణ్ ఈ సినిమాని నిర్మిస్తున్నారు. ఇక సినిమాలో చరణ్ పాత్ర త్యాగం చేసే పాత్రగా ఉంటుందట. ఏది ఏమైనా మెగాస్టార్ – కొరటాల కలయికలో ఒక పవర్ ప్యాక్డ్ కమర్షియల్ ఎంటెర్టైనర్ రాబోతుంది.

సంబంధిత సమాచారం :

More