ట్విట్టర్‌లో అరుదైన ఘనత సాధించిన రియల్ హీరో సోనూసూద్..!

Published on Jan 19, 2022 3:01 am IST

కరోనా కష్టకాలం ప్రారంభమైనప్పటి నుంచి పలు ఇబ్బందులు పడుతున్న ఎందరికో తనవంతు సాయం అందచేస్తూ రీల్ లైఫ్‌లో విలన్ పాత్రలు పోషించినా రియల్ లైఫ్‌లో నిజమైన హీరో అనిపించుకుంటున్నాడు సోనూసూద్. సమస్య ఉందంటే చాలు దానికి సొల్యూషన్ సోనూలా మారిపోయాడు. ఇప్పటికీ సోనుసూద్‌ తన సేవా కార్యక్రమాలను కొనసాగిస్తూనే ఉన్నాడు. దీంతో సోనూసూద్‌కి భారీగా ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగిపోయింది.

ఇదే కాకుండా సోనూసూద్‌కి సోషల్ మీడియాలో కూడా గట్టిగానే ఫాలోయింగ్ పెరుగుతుంది. ఆయన ట్విట్టర్ అకౌంట్‌ను ఫాలో అయ్యేవారి సంఖ్య 11 మిలియన్లను దాటింది. అయితే భారతదేశంలో అత్యధికంగా అనుసరించే ప్రముఖులలో సోనూసూద్ ఒకడిగా నిలిచాడు.

సంబంధిత సమాచారం :