మాస్ మహారాజ్ “క్రాక్” హీరోగా సోనూ సూద్..అసలు మ్యాటర్ ఇది.!

మాస్ మహారాజ్ “క్రాక్” హీరోగా సోనూ సూద్..అసలు మ్యాటర్ ఇది.!

Published on Jan 16, 2021 7:01 PM IST

మన టాలీవుడ్ మోస్ట్ లవబుల్ హీరోల్లో మాస్ మహారాజ్ రవితేజ కూడా ఒకరు. అందరి హీరోల అభిమానులు కలిసి సపోర్ట్ చేసే ఏకైక తెలుగు హీరో ఎవరన్నా ఉన్నారు అంటే అది మాస్ మహారాజ్ రవితేజ అనే చెప్పాలి. అలా తన సాలిడ్ కం బ్యాక్ హిట్ కోసం అందరు ఎంతగానో ఎదురు చూస్తున్న తరుణంలో తన హ్యాట్రిక్ దర్శకుడు గోపీచంద్ మలినేనితో చేసిన “క్రాక్” అనే పవర్ ఫుల్ సినిమాతో వచ్చి నెవర్ బిఫోర్ కం బ్యాక్ హిట్ ను అందుకున్నారు.

ఇప్పటికీ కూడా సూపర్ స్ట్రాంగ్ గా బాక్సాఫీస్ వసూళ్లు అందుకుంటున్న ఈ చిత్రం కరోనా సమయంలో కూడా భారీ లాభాలను తెచ్చిపెట్టడం ఖాయంలా కనిపిస్తుంది. మరి ఈ చిత్రాన్ని హీరోగా సిల్వర్ స్క్రీన్ పై విలన్, ఆఫ్ స్క్రీన్ లో రియల్ హీరో అనిపించుకున్న సోనూ సూద్ చేయనున్నారట. అదేంటి ఆల్రెడీ రవితేజ హీరోగా చేసింది మళ్ళీ సోనూసూద్ చెయ్యడం..అనుకుంటున్నారా?

అసలు విషయం ఏమిటంటే ఈ చిత్రంను సోనూసూద్ హీరోగా బాలీవుడ్ లో రీమేక్ చెయ్యడానికి రెడీ అవుతున్నట్టుగా ఇండస్ట్రీ వర్గాల్లో టాక్ వినిపిస్తుంది. ఇప్పటికే ఈ సినిమా రీమేక్ హక్కులు కోసం సోనూసూద్ మరియు నిర్మాతల మధ్య సంప్రదింపులు జరుగుతున్నాయట. మరి ఈ స్వింగ్ టైం లో సోనూసూద్ కానీ ఈ పవర్ ఫుల్ ప్రాజెక్ట్ ను బాలీవుడ్ లో చేస్తే బాక్సాఫీస్ దగ్గర ఆ ఇంపాక్ట్ వేరే లెవెల్లో ఉంటుంది అని చెప్పాలి. మరి ఈ రీమేక్ ఎంత వరకు నిజం అవుతుందో చూడాలి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు