బాలీవుడ్ దిగ్గజ దర్శకుడిగా రాజ్‌కుమార్ హిరానీకి చాలా మంచి పేరు ఉంది. ఐతే, బాలీవుడ్ సీనియర్ హీరో సంజయ్ దత్ హీరోగా తెరకెక్కిన మున్నాభాయ్ MBBS, లగే రహో మున్నాభాయ్ చిత్రాలు అద్భుత విజయాలు సాధించాయి. ఇప్పుడు మూడో పార్ట్ కోసం కసరత్తులు చేస్తున్నారు. ప్రస్తుతం స్క్రిప్ట్ వర్క్ జరుగుతోంది. ఐతే, ఇప్పుడు తాజాగా ఈ సినిమా పై ఓ క్రేజీ అప్ డేట్ వినిపిస్తోంది. ఈ సినిమాలో సౌత్ హీరోలు గెస్ట్ రోల్స్ లో కనిపించబోతున్నారు. తెలుగు నుంచి విక్టరీ వెంకటేష్, కన్నడ నుంచి శివరాజ్ కుమార్, తమిళ నుంచి విజయ్ సేతుపతి గెస్టులుగా నటిస్తున్నారట.
సహజంగా రాజ్‌కుమార్ హిరానీకి బాలీవుడ్ లో ఫుల్ క్రేజ్ ఉంది. ఇటు సౌత్ లో ఆయన సినిమాలకు ఓ వర్గంలో ఫుల్ గిరాకీ ఉంది. ఈ నేపథ్యంలో సౌత్ హీరోలు కూడా ఆయన సినిమాలో కనిపించబోతూ ఉండటం విశేషం. పైగా సంజయ్ దత్ తో తాను చేసిన గత సినిమాల కంటే ఈ సినిమా మెరుగ్గా ఉండేందుకు ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నట్లు రాజ్‌కుమార్ హిరానీ పేర్కొన్నారు. అన్నట్తు ఈ చిత్రాలను తెలుగులో శంకర్‌దాదా MBBS, శంకర్‌దాదా జిందాబాద్ పేరుతో మెగాస్టార్ రీమేక్ చేసిన సంగతి తెలిసిందే.