మరోసారి విషమించిన ఎస్పీ బాలు ఆరోగ్యం

Published on Sep 24, 2020 6:35 pm IST

ప్రముఖ గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం కరోనా కారణంగా గత 40 రోజులుగా చెన్నైలోని ఎంజీఎం ఆస్పత్రిలోనే ఆయన చికిత్స పొందుతున్న సంగతి తెలిసిందే. మొదట్లో బాగా విషమించిన ఆయన ఆరోగ్యం మెల్లగా కోలుకుంటూ వచ్చింది. తమ అభిమాన గాయకుడు అనారోగ్యం పాలవడంతో అభిమానులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. వాటికి తోడు అనేక రూమర్లు రావడంతో అభిమానులు, సినీ జనాల్లో ఆందోళన మరింత పెరిగింది. దీంతో ఆయన కుమారుడు బయటికొచ్చి ఎప్పటికప్పుడు బాలుగారి ఆరోగ్యం గురించి అప్డేట్స్ ఇస్తూ వచ్చారు.

గత పది రోజులుగా ఆయన కోలుకుంటున్నట్టు తెలిపారు. కానీ ఉన్నట్టుండి ఇవాళ ఆయన ఆరోగ్యం బాగా క్షీణించిందని సమాచారం బయటికొచ్చింది. ఈ వార్తతో మరోసారి అభిమానులు ఆందోళనకు గురవుతున్నారు. బాలుగారి ఆరోగ్యం మీద ఇంకాసేపట్లో ఆసుపత్రి వర్గాలు పూర్తి వివరాలతో హెల్త్ బులెటిన్ విడుదల చేయనున్నాయి. ఈ విషయం తెలిసిన సినీజనం, సంగీత ప్రియులు బాలుగారు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నారు.

సంబంధిత సమాచారం :

More