ఆటోనగర్ సూర్య కోసం 2 కోట్ల సెట్

ఆటోనగర్ సూర్య కోసం 2 కోట్ల సెట్

Published on Jan 30, 2012 5:50 PM IST

యువ సామ్రాట్ నాగ చైతన్య తరువాత చిత్రం ‘ఆటోనగర్ సూర్య’ లో ఫుల్ లెంగ్త్ మాస్ పాత్రలో కనిపించబోతున్నాడు. ఈ చిత్రానికి విమర్శకులు మెచ్చిన దర్శకుడు దేవకట్ట డైరెక్ట్ చేస్తున్నాడు. విశ్వసనీయ సమాచారం ప్రకారం ఈ చిత్రం కోసం ప్రత్యేకంగా 2 కోట్లు వెచ్చించి ఒక సెట్ నిర్మించారని సమాచారం. సమంత హీరొయిన్ గా నటిస్తుండగా అనుప్ రూబెన్స్ సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రం విజయవాడ నేపధ్యంలో యూనియన్ లేబర్ బ్యాక్డ్రాప్లో తెరకెక్కిస్తున్నారు. ఆటోనగర్ సూర్య చిత్రాన్ని ఆర్ఆర్ మూవీ మేకర్స్ వారు సమర్పిస్తుండగా కె. అచ్చిరెడ్డి నిర్మిస్తున్నారు. ఈ వేసవిలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు