విజయ్ సేతుపతికి స్పెషల్ అప్లాజ్..

విజయ్ సేతుపతికి స్పెషల్ అప్లాజ్..

Published on Jun 15, 2024 10:00 AM IST

మన దక్షిణాది సినిమా దగ్గర తన నటనతో ఆడియెన్స్ కి కట్టి పడేసే అతి కొద్ది మంది నటుల్లో ప్రముఖ నటుడు మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి కూడా ఒకడు. మరి విజయ్ సేతుపతి ఇప్పుడు వరకు ఎన్నో ఐకానిక్ పాత్రలు చేసి మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. మరి అలా తన కెరీర్ 50వ సినిమా “మహారాజ” తో నిన్న తెలుగు సహా తమిళ్ భాషల్లో థియేటర్స్ లోకి రాగ ఒక హీరోకి లేదా నటుడికి బెంచ్ మార్క్ సినిమా అంటే ఎలా ఉండాలో ఆ రేంజ్ లో తన 50వ సినిమాని తాను మలచుకున్నాడు.

మెయిన్ గా ఈ సినిమాలో సేతుపతి పెర్ఫామెన్స్ కి మాత్రం యూనానిమస్ గా మన తెలుగు సహా తమిళ్ ఆడియెన్స్ నుంచి విపరీతమైన ప్రశంసలు వస్తున్నాయి. అంత రీతిలో విజయ్ సేతుపతి తన సహజమైన నటనతో అందరినీ ఆకట్టుకున్నాడు. ఓవరాల్ గా తన సినిమాకి ఇప్పుడు సాలిడ్ పాజిటివ్ టాక్ అందరిలో రీచ్ అయ్యింది. మరి వసూళ్లు ఏ తరహాలో నమోదు అవుతాయో చూడాలి. ఇక ఈ చిత్రానికి నిథిలన్ స్వామినాథన్ దర్శకత్వం వహించగా తెలుగులో మైత్రి మూవీ డిస్ట్రిబ్యూషన్ వారు రిలీజ్ చేశారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు