ఆకాశ గంగ అమాంతం దుఃఖ వరదలా మారి తెలుగు జాతిని ముంచెత్తినట్టు ఉంది
గురువుగారు సిరివెన్నెల సీతారామశాస్త్రి గారు ఇక మనకు లేరు అంటె
ఎందరివో ప్రేమ కథలకు వాల్మికి ఆయన
మరెందరివో విజయగాథలకు అలుపెరుగని ప్రేరణ
నిద్రించే సమజానికి మేలుకొలుపు
బాధించే అపజయాలకు నిలువెత్తు ఒదార్పు ఆయన పాట
జీవత్సవాలని నిగ్గదీసి చలనం నేర్పిన విప్లవం ఆయన కలం
శివయ్య! ఇంతలోనే ఆయన్ని మాకు దూరం చేసి బూడిద ఇచ్చిన నిన్ను …. ఇంక ఎది కోరెది, ఇంకేది అడిగేది
తెలుగు పాటలో అక్షరం అశ్రువులా మారి చెంపలపై జారి మా గుండెల్లో చేరి చిరకాలం గురువుగారిని అక్కడే పదిలంగా ప్రతిష్టించిన ఈ తరుణంలో గురువుగారు మీకు ఇదే మా అశ్రునివాళీల అభిషేకం
– Rohit