మెగాస్టార్ చిరంజీవి హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఓ ఫుల్ కామెడీ ఎంటర్ టైనర్ రాబోతుంది. ప్రస్తుతం ఈ సినిమా స్క్రిప్ట్ వర్క్ శరవేగంగా జరుగుతుంది. ఇప్పటికే, ఫస్ట్ హాఫ్ ను లాక్ చేశారు. ప్రస్తుతం సెకండ్ హాఫ్ పై వర్క్ జరుగుతుంది. సెకండ్ హాఫ్ లో ఫుల్ ఫన్ ఎలిమెంట్స్ తో పాటు ఫుల్ యాక్షన్ సీక్వెన్సెస్ ఉంటాయని.. అందుకు తగ్గట్టు.. సెకండ్ హాఫ్ లో మెగాస్టార్ పాత్ర పై ఓ ఫ్లాష్ బ్యాక్ ను ప్లాన్ చేశారని తెలుస్తోంది. ఈ ఫ్లాష్ బ్యాక్ లో మెగాస్టార్ పాత్ర రాయలసీమ నేపథ్యంలో ఉంటుందని తెలుస్తోంది.
ఇక ఈ చిత్రం జూన్ లో ప్రారంభమవుతుందని ఇప్పటికే చిరు తెలిపారు. ఈ సినిమా గురించి మెగాస్టార్ ఇంకా మాట్లాడుతూ.. ‘ఈ సినిమా పూర్తిస్థాయి వినోదాత్మక చిత్రమని.. ఈ మూవీ సెట్స్‌లో అడుగుపెట్టేందుకు తాను ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను అని చిరు ఆల్ రెడీ చెప్పారు. ఈ సినిమా కచ్చితంగా అభిమానులకు నచ్చుతుంది’ అని మెగాస్టార్ చిరంజీవి తెలిపారు. ఇక సాహు గారపాటి, సుస్మిత (చిరంజీవి కుమార్తె) సంయుక్తంగా ఈ సినిమాని నిర్మిస్తారని చిరు తెలిపారు.