“కల్కి” నుంచి వచ్చేసిన స్పెషల్ ఫుల్ వీడియో సాంగ్..!

“కల్కి” నుంచి వచ్చేసిన స్పెషల్ ఫుల్ వీడియో సాంగ్..!

Published on Jun 29, 2024 12:56 PM IST


రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా దిశా పటాని హీరోయిన్ గా దర్శకుడు నాగ్ అశ్విన్ తెరకెక్కించిన లేటెస్ట్ భారీ చిత్రం “కల్కి 2898 ఎడి” ఇప్పుడు పాన్ ఇండియా లెవెల్లో అదరగొడుతున్న సంగతి తెలిసిందే. మరి ఈ చిత్రంలో ప్లాన్ చేసిన ఎన్నో సర్ప్రైజ్ లలో డైరెక్ట్ గా సినిమాలోనే చూపించిన స్పెషల్ సాంగ్ కూడా ఒకటి. మరి ప్రభాస్ (Prabhas) కంప్లెక్స్ కి వెళ్లాలని బాగా ట్రై చేస్తూ దిశా పటానితో (Disha Patani) వెళ్ళాక చేసే రచ్చలో భాగంగా వచ్చే ట టక్కర సాంగ్ ని ఇప్పుడు మేకర్స్ రిలీజ్ చేసేసారు.

అది కూడా ఎలాంటి లిరికల్ కూడా కాదు డైరెక్ట్ సినిమాలో చూపించిన అన్ని విజువల్స్ తో ఫుల్ హెచ్ డి లోనే రిలీజ్ చేసేసారు. మరి ఈ సాంగ్ ని మొదట సంతోష్ నారాయణన్ ఏమన్నా తేడా చేస్తాడా అని కొందరు అనుకున్నారు కానీ థియేటర్స్ లో మాత్రం ఇది మంచి ట్రీట్ ని అందించింది. ఇక ఈ ఫుల్ సాంగ్ ని అయితే మేకర్స్ నేరుగా యూట్యూబ్ లోనే రిలీజ్ చేసేసారు. ఇక ఈ భారీ చిత్రంలో కమల్, అమితాబ్ లాంటి దిగ్గజ నటులు కూడా నటించగా వైజయంతి మూవీస్ వారు నిర్మాణం వహించారు.

సాంగ్ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి

సంబంధిత సమాచారం

తాజా వార్తలు