‘చరణ్ – శంకర్’ సినిమాలో స్పెషల్ రోల్ ?

Published on Dec 6, 2022 12:00 am IST

క్రేజీ డైరెక్టర్ శంకర్ – మెగా పవర్ స్టార్ ‘రామ్ చరణ్ తేజ్’ కాంబినేషన్ లో రాబోతున్న పాన్ ఇండియా సినిమాలో ఓ విప్లవ నాయకుడి పాత్ర ఉందట. ఈ సినిమా పీరియాడిక్ పొలిటికల్ డ్రామా. పోరాటం ద్వారానే దేశంలో అవినీతిని తరిమి కొట్టవచ్చు అని నమ్మి, అది ఆచరణలో పెట్టే నాయకుడు పాత్ర అట అది. ఇప్పుడు ఈ పాత్ర కోసం ఓ సీనియర్ హీరోని ఫైనల్ చేసే పనిలో ఉన్నారు శంకర్. ఈ క్రమంలోనే ఓ బాలీవుడ్ హీరోతో చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది.

ఈ సినిమా సెకండ్ హాఫ్ లో వచ్చే ఈ స్పెషల్ రోల్ సినిమాకే హైలైట్ గా నిలుస్తోందట. ఇక ఈ సినిమాలో రామ్ చరణ్ తన కెరీర్ లోనే బెస్ట్ లుక్‌లో కనిపించబోతున్నాడు. వెరీ స్టైలిష్ లుక్ లో విభిన్న శైలితో చరణ్, ఈ సినిమాలోనే ప్రధాన హైలైట్‌ గా నిలుస్తాడట. పైగా ఈ సినిమాలో చరణ్ ద్విపాత్రాభినయం చేస్తున్నాడు. వీటిలో ఒక పాత్రలో గ్రామీణ యువకుడిగా, మరో పాత్రలో సూపర్ స్టైలిష్ గా కనిపిస్తాడట. చరణ్ లుక్ కోసం బాలీవుడ్ ప్రముఖ హెయిర్‌ స్టైలిస్ట్ అలీమ్ హకీమ్ పనిచేస్తున్నాడు.

సంబంధిత సమాచారం :