చైతు ‘లవ్ స్టోరీ’లో స్పెషల్ సాంగ్ !

Published on Aug 16, 2020 1:09 am IST

హీరో నాగ చైతన్య, సాయి పల్లవి జంటగా సెన్సిబుల్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల డైరెక్షన్ లో తెరకెక్కుతున్న మూవీ ‘‘లవ్ స్టోరీ’’. అయితే ఈ సినిమాలో ఒక స్పెషల్ సాంగ్ ఉందట. ఆ సాంగ్ అంతా డ్యాన్స్ మీదే సాగుతుందని.. ఈ సాంగ్ లో చైతు ఫుల్ డాన్స్ చేశారని, చైతూ గత చిత్రాల్లో వేయని రేంజ్ స్టెప్స్ ను ఈ సారి ఈ స్పెషల్ సాంగ్ లో వేశారని తెలుస్తోంది. మొత్తానికి చైతులోని డ్యాన్స్ స్కిల్స్ ను పూర్తిస్థాయిలో శేఖర్ కమ్ముల వాడుకున్నట్టు ఉన్నాడు.

కాగా తెలంగాణ నేపథ్యంలో నడిచే రియలిస్టిక్ లవ్ స్టోరీలా ఈ సినిమా ఉండనుంది. కథలో రియాలిటీ కోసం కొంతభాగం గ్రామీణ ప్రాంతాల్లో షూట్ చేశారు. ఈ ప్రేమకథ సమ్మర్ కి స్సెషల్ ఎట్రాక్షన్ గా రావలనుకున్నా కరోనా అడ్డు తగిలింది. కాగా నారంగ్ సమర్పణలో శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ ఎల్ పి బ్యానర్ పై నారాయణ్ దాస్ కె నారంగ్, పి రామ్మోహన్ రావు నిర్మిస్తున్నారు. అక్కినేని అభిమనుల్లో, అలాగే ప్రేక్షకుల్లో ఈ సినిమా పై బాగానే అంచనాలు ఉన్నాయి.

సంబంధిత సమాచారం :

More